Jump to content

ద్రౌపది

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • పాంచాల రాజైన ద్రుపద మహారాజు కుమార్తె . మహాభారరము లో ప్రముఖ పాత్ర . అర్జునుడు మత్స్యయంత్రము కొట్టగా ఆమె పాండవులకు భార్య అయినది .
  1. ద్రుపద మహారాజు కూఁతురు. పాండవుల భార్య. ఈమె తొలిజన్మమున నలాయనుఁడు అను ఋషి కూఁతురు. ఇంద్రసేన అను నామమున మౌద్గల్యుఁడు అను మహామునికి భార్య అయి ఉండిన పతివ్రతాశిరోమణి. కర్మవశముచే అతఁడు కుష్ఠవ్యాధిపీడితుఁడై ఉండెను. అయినను ఇంద్రసేన అతనిని అతిభక్తితో ఆదరించుచు ఉండును. అది చూచి అతఁడు మిక్కిలి సంతసిల్లి ఆమెను వరమువేడుము అనఁగా అపుడు ఆమె తనకు కామభోగేచ్ఛ మిగుల కలదు అనియు అతనిని కామరూపము ధరించి అయిదుప్రకారముల తనతో కూడి రమింపవలయు అనియు వేఁడెను. అతఁడు అట్లే ఆమెను కూడి చిరకాలము ఉండి దేవలోకప్రాప్తి చెందును. ఇంద్రసేన కాలవశమున శరీరము విడిచియు కామభోగమునందు తృప్తిలేక మఱుజన్మమున కాశిరాజు కూఁతురు అయిపుట్టి కన్యాత్వమున బహుకాలము ఉండి పశుపతిని ఉద్దేశించి ఉగ్రతపముచేయ అతఁడు ప్రత్యక్షమై వరమువేఁడుము అనఁగా అపేక్షాతిశయముచేత పతి, పతి, పతి, పతి, పతి అని అయిదు మాఱులు పలికెను. అది కారణముగ ఆమె ద్రౌపదియై పుట్టి పాండవులకు అయిదుగురికిని భార్య ఆయెను. ఈమె యజ్ఞకుండమున పుట్టుటచే యాజ్ఞసేని అనియు, ద్రుపదుని కూఁతురు అగుటచే ద్రౌపది అనియు, పాంచాలుని కూఁతురు కాన పాంచాలి అనియు చెప్పఁబడును. [పాంచాలదేశపు రాజు అగుటచే ద్రుపదుఁడు పాంచాలుఁడు అనఁబడును.] ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కృష్ణ. ఈమెకు ధర్మరాజు వలన ప్రతివంద్యుడును. భీమునివలన శ్రుతసోముడును, అర్జునుని వలన శ్రుతకీర్తియు, నకులుని వలన శతానీకుడును, సహదేవుని వలన శ్రుతసేనుడును పుట్టిరి. ఈ ఏవురును ఉపపాండవులు అనఁబడుదురు. ఈమె శచీదేవి యంశము
నానార్థాలు
సంబంధిత పదాలు

ద్రౌపతి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ద్రౌపది&oldid=955775" నుండి వెలికితీశారు