నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


వివరణ అవసరం లేని సామెత ఇది. వడ్లు దంచే విషయం గురించి తెలియని వారికి ఇది తెలియకపోవచ్చు. ధాన్యం మిల్లులు లేని రోజుల్లో, రోటిలో వడ్లు పోసి రోకలితో దంచి, ఊక తీసి, ఆ బియ్యాన్ని వండుకునేవాళ్ళు. ఈ దంచడమనేది శ్రమతో కూడుకున్న పని. మనుషులు నిలబడి, బరువైన రోకలిని ఒకచేత్తో పైకెత్తి రోట్లోని వడ్లపైకి పొడుస్తారు. వెంటనే రెండో చేత్తో దానిని పైకెత్తి, మళ్ళీ పొడుస్తారు. వడ్లపైని పొట్టు పోయి, బియ్యం బయట పడే వరకు ఇలా చేస్తారు. ఒకే రోట్లో ఒకరి కంటే ఎక్కువ మంది తలా ఒక రోకలితో దంచడం కూడా చేస్తారు.

ఇక సామెతకు వస్తే - వడ్లు నువ్వు దంచు, (దంచుతున్నట్లు అభినయిస్తూ) భుజాలు నేనెగరేస్తాను - అనటంలో పని నువ్వు చెయ్యి, నేను ఎగ్గొడతాను అని అర్ధం. 2005 సెప్టెంబర్ లో భారత క్రికెట్ కెప్టెను సౌరవ్ గంగూలీ వివాదానికి సంబంధించి ఒక వ్యాసం ప్రచురిస్తూ ఈనాడు దినపత్రికలో ఈ సామెతను అద్భుతంగా వాడారు. ఆ వ్యాసాన్ని ఇక్కడ చూడండి.

నువ్వు దంచు... నేను భుజాలెగరేస్తాను అంటే అన్నివేళలా కుదరదు మరి