భోజుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. భోజుడు సాత్వతుని పుత్రుఁడు. కుంతి పెంపుడుతండ్రి. వీనివంశమును భోజవంశము అందురు. ఇతనిని మహాభోజుఁడు, కుంతిభోజుఁడు అనియు అందురు.
- 2.భోజుడు కృతవర్మ పితామహుఁడు. శిని కొడుకు.
- 3. విక్రమార్కుఁడు గతించిన పిమ్మట కొంత కాలమునకు విదర్భ దేశాధిపతియై ఉండిన రాజు. ఇతని రాజధాని ధారాపురము. ఇఁడు బాలుఁడుగా ఉండఁగానే ఇతని తండ్రి కాలధర్మమును పొందినందున పినతండ్రి అగు ముంజుడు రాజ్యాధిపతి అయ్యెను. ఆకాలమునందు ఒక జ్యోతిష్కుడు ముంజుని సమ్ముఖమునకు వచ్చి అచ్చట కూర్చుండిఉన్న ఈచిన్నవానిని చూచి ఇతఁడు మిగుల ప్రఖ్యాతి వహించి రాజ్యపాలనము చేయఁగలడు అనిచెప్పెను. అది విని ముంజుడు సహింపక ఇతనిని అడవికి కొనిపోయి తలనఱకి చంపి రండు అని తలవరులకు ఆజ్ఞాపించెను. అప్పుడు తలవరులు ఇతనిని అడవికి కొనిపోయి తమ యేలినవాని ఉత్తరువు తెలియ పఱువఁగా ఇతఁడు దిగులు పడక "శ్లో|| మాంధాతాచ మహీపతిః కృతయుగాలంకారభూతో గతః | సేతుర్యేన మహోదధౌ విరచితః క్వాసౌ దశాస్యాంతకః | అన్యేచాపి యుధిష్ఠిరప్రభృతయో యాతా దివం భూపతే | వై కేనాపి సమంగతా వసుమతీ నూనం త్వయా యాస్యతి" అను శ్లోకమును ఒక పత్రికయందు వ్రాసి తన పినతండ్రియొద్దకు పంపెను. అతఁడు దానిని చదువుకొని అందలి అర్థమును గ్రహించి వెంటనే ఇతనిని రప్పించి రాజ్యాభిషేకముచేసి తాను విరక్తుఁడై తపస్సు చేయఁబోయెను. ఇతఁడు మిక్కిలి చదువుకొన్నవాఁడు కనుక కాళిదాసాది మహాకవులను అనేకులను గౌరవించి తన యొద్ద ఉంచుకొని ఉండెను. ఇతని రాజ్యమునందు అపండితుఁడు ఒక్కడైన దొరకడు అందురు. మఱియు ఇతఁడు సరస్వతి అవతారము అని చెప్పుదురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు