మూరిబోవు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

దే. అ.క్రి .(మూరి + పోవు)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అతిశయించు;/ వర్ధిల్లు; / విజృంభించు;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

సఫలమగు / నశించు;

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. అతిశయించు;="శా. శ్రీకంఠుండు సదాశివుండు నియతిన్‌ శృంగారలోలుండు గౌ, రీకాంతాసహితంబు సమ్మదము మూరింబోవ వేంచేసె." వీర. ౩, ఆ.
2. వర్ధిల్లు;="ఎ, గీ. అట్లుగానఁ బ్రావృట్ఛరదాగమముల, నధికభక్తి మహాపూజ యాచరించి, నన్ను సేవించి మనుజుండు నాప్రసాద, మున ధనము ధాన్యమును గల్గి మూరిఁబోవు." మార్క. ౬, ఆ.
3. విజృంభించు;="సీ. వేఱయొకత, విశ్వకర్ముని కూఁతు విశదలావణ్యసముజ్జ్వలఁ జేకొని మూరిఁబోయి." హరి. ఉ. ౪, ఆ.
4. సఫలమగు;="మ. ఈ, పడఁతిం బుత్రునిఁ జేసి మీదగు కృపా ప్రావీణ్యముం బెంపు నే, ర్పడ నాకోరిక మూరిబోదగ గృతార్థత్వంబు నొందింపరే." మార్క. ౭, ఆ.
5. నశించు;="ఎ, గీ. చదువు చట్టువడియె శాస్త్రంబు మన్నయ్యె, బుద్ధి పురువుమేసెఁ బుణ్యమడఁగె, నీతి మట్టువడియె, నిర్మలజ్ఞానంబు, మొదలికుడిగె బోధ మూరిఁబోయె." భాగ. ౬, స్కం

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=మూరిబోవు&oldid=862409" నుండి వెలికితీశారు