Jump to content

మోర

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తల అని అర్థము (ఈ పదము కేవలము జంతువులకు మాత్రమే వాడుతారు.. ఉదా: ఆవు ఆకలిగొని మోర పైకెత్తి చూస్తున్నది. అని ఆంటారు.)

  • పశ్వాదుల దీర్ఘముఖము
  • (నిందయందు) మనుష్యముఖము

మెడ

నానార్థాలు

మోము, మోరము, లపనము, వదనము.

సంబంధిత పదాలు

కంఠము, కంధరము, కంధి, కంబుక, కంబుకము, కుత్తుక, గళము, గొంతు, గొంతుక, బొండుగ,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • "ఆ. మోరమోర మోపి మూరకొనియె." (ఇక్కడ అశ్వముఖము.) కాశీ. 4, ఆ.
  • "ఎ, గీ. నురువులురుల వెడఁదనోళ్లతోడుత మోర, లెత్తుకొనుచు." (ఇక్కడ ఉష్ట్రముఖము.) రా. యు, కాం.
  • "వ. ముంగిసమోరలంబోని మోరలు సారెసారెకునెత్తి." (ఇక్కడ నకులశునకముల ముఖములు.) స్వా. 4, ఆ. (ఇట్లు ప్రయోగములచేత ఇతరములైన వానికిని తెలియునది.)
  • ఒక పాటలో పద ప్రయోగము: ఎల్లి నాతో సరస మాడేనూ.... మల్లీ మల్లీ నన్నె చూసేనూ...... తల్లో పూలు పెట్టి గళ్ళ కోక కట్టి మెల్లంగ నాసాయి కొచ్చేను.... .... మోరెత్తి సూతారు.....
  • ఓడకముందర నొకసారమేయంబు మొరుగుచునున్నది మోర యెత్తి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మోర&oldid=865024" నుండి వెలికితీశారు