వాడుకరి:Rajasekhar1961
తెలుగు భాషలోని పదాలన్నింటినీ విక్షనరీలో చేర్చాలన్నది నా ధ్యేయం.
మొదటి పదం
[<small>మార్చు</small>]3 జూలై 2007 తేదీన విక్షనరీలో మొదటి మార్పు చేశాను.
తెలుగులో జంట పదముల గురించి
[<small>మార్చు</small>]రాజసేఖర్ గారూ............ ఈ క్రింది విషయాన్ని కొంత పరిశీలించండి.
తెలుగు భాషలో జంటపదములు అనేకం వున్నాయి. పరిశీలిస్తే వాటిలో కొన్ని భేదాలున్నాయి. కొన్నింటిలో ఒకే పదం రెండు సార్లు రావడం. ఉదాహరణకు: 1. మళ్ళీమళ్ళీ, రానురాను / పోను పోను మొదలగునవి. ఈ రెండు పదాలకు విడివిడిగా ఒకే అర్థంమున్నా.... ఆ రెండు పదాలాల కలయిక వల్ల కూడ ఇంచు మించు అదే అర్థం వచ్చినా ఆ అర్థంలోని భావ ప్రకటన మరింత బలంగా వుంటుంది. 2. జంట పదాలలో రెండు విడి విడి పదాలు. వీటిలో ఉత్తర పదానికి గానీ, పూర్వ పదానికి గాని మాత్రమే అర్థం వుంటుంది. మరొక పదానికి విడిగా ఎలాంటి అర్థం వుండదు. ఆ రెండు పదాలు కలిస్తేనే సంపూర్ణ అర్థం వస్తుంది. ఉదా: ఉప్పు కప్పురంబు. దీనిలో ఉత్తర పదమైన కప్పురంబు అనే పదానికి ఎలాంటి అర్థం వుండదు... కాని ఆ రెండు పదాలు కలిస్తేనే సరైన అర్థం వస్తుంది. మరో ఉదా: అడపాదడపా.... ఇందులో ఉత్తర పదమైన దడపా అనే పదానికి కూడ విడిగా అర్థం లేదు. పైన కనబరచిన రెండు విధానాలలో వున్న మరి కొన్ని పదాలు క్రింద ఇవ్వబడ్డాయి. 3. మరి కొన్ని జంట పదాలలో విడివిడిగా రెండింటికి ఎలాంటి అర్థం వుండదు.. కానీ ఆరెండు పదాలు కలిసి జంటగా ఏర్పడితేనే సరైన అర్థం వస్తుంది. ఉదా: టింగురంగ 4. మరొక విధమైన జంట పదాలు: వీటిలో రెండు వేరు వేరు అర్థవంతమైన పదాలు. కానీ ఆ రెండు కలిసినపుడు వచ్చే పదానికి మరో అర్థం వుంటుంది. ఉదా: తోడునీడ / ఈడుజోడు
1.ఒకే పదం రెండు సార్లు వచ్చి వాటికి విడివిడిగా సమాన ఆర్థం వుండి ఆ రెండు కలిసినపుడు స్వల్ప తేడాలో క్రొత్త అర్థం వున్న కొన్ని జంట పదాలు:.... పదేపదే /చెంగుచెంగున/చిలికిచిలికి/ చెప్పిచెప్పి/ తినగతినగ/ గుసగుస/ గుచ్చిగుచ్చి/
2. జంట పదాలలో ఒక దానికి మాత్రమే సరైన అర్థం వుండి.... రెండో పదానికి విడిగా ఎలాంటి అర్థం లేక రెండో పదం తో కలిస్తేనే సరైన అర్థం వచ్చే కొన్ని జంట పదాల:..... చీటికి మాటికి/ జంకుగొంకు/తత్తర బిత్తర/వేలంవెర్రి/ఇంటబయట/ ఇల్లువాకిలి//వావి వరుస/కట్టుబొట్టు
3.ఈ వర్గంలోని జంట పదాలలో ఏ ఒక్కదానికి విడిగా సరైన అర్థం లేకున్నా ఆ రెండు కలిస్తేనే సరైన అర్థం వస్తుంది: ఉదా:టింగురంగ/ కలోగంజో/
4. ఈ వర్గంలోని జంట పదాలలో రెండు పదాలకు విడివిడిగా అర్థం వున్నా... ఆ రెండు కలిసినపుడు వేరే అర్థం వస్తుంది. ఉదా:చచ్చీచెడీ/చావోరేవో/