విక్షనరీ:తెలుగు విక్షనరీ

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

చదువరీ, విక్షనరీ మీద దృష్టిసారించినందుకు థాంక్స్! ఆంగ్ల విక్షనరీలో పేజీలు గందరగోళంగా ఉన్నమాట వాస్తవమే, కానీ ఎందుకు అలాంటి ఫార్మాట్ ఎన్నుకున్నారో అర్ధం కావడము లేదు. ముందు ముందు విక్షనరీతో ఏమి సాధించాలనుకుంటున్నారో అంత స్పష్టముగా లేదు. నేను కొంత దాని గురించి చదవవలసి ఉన్నది. ఆంగ్ల విక్షనరీలో ఇతర భాషా పదాలకు కూడా పేజీలు ఉన్నాయి. అలా అయితే వేరు వేరు భాషలలో విక్షనరీల అవసరము ఏమిటి? మనము ఆంగ్ల విక్షనరీలో కూడా తెలుగు పదాలకు పేజీలు తయారు చెయ్యాలా? అలాగే తెలుగు వికిలో అన్నిఇతర భాషల పదాలకు (కనీసం ఆంగ్ల పదాలు) పేజీలు ఉండాలా? కొంచెం ఆలశ్యము అయినా మనము తెలుగు వికితో ఏమి సాధించాలకుంటున్నామో నిర్ణయించి అందుకు అనుగుణముగా మన మూస ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము.--వైఙాసత్య 17:20, 19 March 2006 (UTC)

కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉదయించాయి.కానీ సమాధానాలు ఎక్కడో?
కొన్ని లింకులు చదవదగినవి

పైవి చదివిన తరువాత నాకు తోచిన కొన్ని ఆలోచనలు

 • ఆంగ్ల విక్షనరీలో తెలుగు పదాలకు పేజీలు సృష్టించడము అంత మంచి ఆలోచన కాదు.
 • ఆంగ్ల విక్షనరీలో ఆంగ్ల పదాలకు మాత్రము తెలుగు అర్ధాలను చేర్చవలెను. దానినుండి తెలుగు వికిలోని ఆ పదము యొక్క పేజీకి లింకు ఇవ్వొచ్చు.
 • తెలుగు విక్షనరీలో నుండి అన్ని భాషల అనువాదాలు చేర్చుదామా? వద్దా? (ఆంగ్లము + భారతీయ భాషలు సరిపోతాయా?)
 • తెలుగు వికిలో ఇతర భాషా పదాలకు పేజీలు సృష్టించొద్దు. కేవలము వాటికి లింకులు మాత్రమే ఇద్దాము.
 • పై విధముగా కొంచెము నిరోధించినందుకు ఏమైనా ఉపయోగత కోల్పోతామా?

--వైఙాసత్య 18:23, 19 March 2006 (UTC)


We should discuss more. The main objective should be that the Telugu Wiktionary should be a trusted source (for Telugu definitions) for as many number of people as possible. My thoughts are below:

 • ఆంగ్ల విక్షనరీలో తెలుగు పదాలకు పేజీలు సృష్టించడము అంత మంచి ఆలోచన కాదు.
From English Wiktionary: This is the English Wiktionary: it aims to describe all words of all languages, with definitions and descriptions in English only.
So it can have a Telugu entry, but the definitions and desciption, usage notes, etc are given in English.
By not creating entries for Telugu words in English Wiktionary, we are depriving English guys learning Telugu words. This may not be much useful right now, but after 5 or 10 years it may make sence.
 • ఆంగ్ల విక్షనరీలో ఆంగ్ల పదాలకుకు మాత్రము తెలుగు అర్ధాలను చేర్చవలెను. దానినుండి తెలుగు వికిలోని ఆ పదము యొక్క పేజీకి లింకు ఇవ్వొచ్చు.
Yes. (Caution: In Telugu wiktionary, they can only see Telugu descriptions.)
 • తెలుగు విక్షనరీలో నుండి అన్ని భాషల అనువాదాలు చేర్చుదామా? వద్దా? (ఆంగ్లము + భారతీయ భాషలు సరిపోతాయా?)
Regarding translations, I think our primary concern should be English and Indian languages. We can also have translations of popular foriegn languages, like German, Spanish, Frensh, etc. There is demand for them. But again, it all depends on the contributors in those areas.
 • తెలుగు వికిలో ఇతర భాషా పదాలకు పేజీలు సృష్టించొద్దు. కేవలము వాటికి లింకులు మాత్రమే ఇద్దాము.
As far as Telugu Wiktionary is concerned, I think we should aim to cover all Telugu words (at least to start with) giving definitions and descriptions, etc in Telugu only. When we have reasonably covered a large portion of Telugu words, we may start allowing words in other languages.
 • పై విధముగా కొంచెము నిరోధించినందుకు ఏమైనా ఉపయోగత కోల్పోతామా?
We may in the short-term. But in the long-run, I think, we should have all words of Telugu and most frequently used words of all other languanges in the world (described in Telugu).

Veeven 06:18, 20 March 2006 (UTC)


పైన మీరు చేసిన కొన్ని వాదనలు చాలా బాగున్నాయి. ఇప్పుడు నాకు మరింత స్పష్టముగా వివిధ భాషల విక్షణరీల యొక్క ఉపయోగము తెలిసింది. నా ఆలోచనలకు కొంచెము మార్పులు చేసి తిరిగి ఈ విషయాలు ప్రతిపాదిస్తున్నాను.

 1. ఆంగ్ల విక్షనరీలో తెలుగు పదాలకు పేజీలు సృష్టించాలి కానీ ప్రస్తుతము తెలుగు విక్షనరీ మీద దృష్టి సారించాలి. వాటి వివరణలు అక్కడ ఆంగ్లములోనే రాయాలి
 2. ఆంగ్ల విక్షనరీలో ఆంగ్ల పదాలకుకు తెలుగు అర్ధాలను చేర్చవలెను. ఆ పేజీ నుండి తెలుగులోని ఆ పదము యొక్క పేజీకి అంతరవికిలింకు ఇవ్వాలి. పదము యొక్క లింకు ఆంగ్ల వికిలోని తెలుగు పదము యొక్క పేజీకి తీసుకువెళుతుంది.
 3. తెలుగు విక్షనరీలోని పదాలకు ఆంగ్లము, భారతీయ భాషలు మరియు తెలుగు విక్షులు నిర్ణయించిన కొన్ని అంతర్జాతీయ భాషలలో అనువాదాలు చేర్చాలి. (మిగిలిన భాషలకు ఎలాగూ ఆంగ్ల వికి ఉంది కనక తెలుగు విక్షనరీలో తెలుగు పదము -> ఆంగ్ల అనువాదము ->ఆంగ్ల విక్షణరీ -> ఇతర భాషా అనువాదము ఉపయోగించొచ్చు) ఏమంటారు?. నాకు మాత్రము అంతర్జాతీయ భాషలలో చైనీస్, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ అయితే చాలనిపిస్తుంది. భారతీయ భాషలలో కూడా అన్నీ ఉంచాలా? లేకపోతే ఎంపిక చేసుకోవాలా?
 4. తెలుగు వికిలో మొదట తెలుగు మరియు ఆంగ్ల పదాలకు పేజీలు సృష్టించుదాము. ఆ తరువాత పరిస్థితిని బట్టి ముందు ముందు ఇతర భాషల పదాల గురించి నిర్ణయము తీసుకొనవచ్చు.
 5. పై విధముగా కట్టుదిట్టము చేస్తే కొంచెము ఉపయోగత కోల్పోయే అవకాశము ఉంది కానీ ఇది మన దృష్టిని, సమయాన్ని, వనరులను కేంద్రీకరించడానికి తోడ్పడుతుందని నా అభిప్రాయము.

వీటి గురించి చర్చించడానికి వ్యాఖ్యల సంఖ్యను ఉపయోగించండి --వైఙాసత్య 15:44, 20 March 2006 (UTC)

పై వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. ఏ యే భారతీయ భాషలలోని పదాలకు పేజీలు ఉండాలి అనేదానికి (వ్యాఖ్య 3), అత్యంత ప్రాచుర్యమైన వాటితో మెదలుపెడదాం. మిగతావారి అభిప్రాయాలకోసం కూడా చూద్దాం. —Veeven 09:41, 22 March 2006 (UTC)

కొత్త పేరు[<small>మార్చు</small>]

ఎందుకో విక్షనరీ పేరుని తెలుగీకరించాలనిపించింది. క్రింది ఆలోచన ఉదయించింది.

 • విఖంటువు, ఒక వికీకృత నిఘంటువు

Veeven 05:06, 23 March 2006 (UTC)

వికీ సర్వర్లలో ఉన్నంత కాలం విక్షనరీ పేరును మార్చలేమనుకుంటా! భాషకో పేరును వికీమీడియా ఒప్పదేమో! __చదువరి 17:03, 28 మార్చి 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇది ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు కానీ ఆంగ్ల వికిలో లేదా వికిమీడియాలో అడిగి కనుక్కోవచ్చు --వైఙాసత్య 19:39, 28 మార్చి 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఇతర భాషాపదాలు[<small>మార్చు</small>]

ఇంగ్లీషులో లాగా ఇతర భాషా పదాలను మనం చేర్చగలమా అని నాకో సందేహం. ఇంగ్లీషులో రాసే వాళ్ళంతా మనలాగా ఏదో ఒక ఇతర భాషలో ప్రవీణులై ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీ పదానికీ అనేక ఇతర భాషల్లో పదాలు చేరతాయి. కానీ ఈ విషయంలో మన పరిధి పరిమితం కదా. విభాగం పెట్టి ఖాళీగా ఉంచే బదులు ఇతర భాషలను ఇంగ్లీషు వరకే పరిమితం చేస్తే బాగుంటుందా!!? సంస్కృతం, హిందీ వంటి కొన్ని భారతీయ భాషలను కూడా చేరుద్దామా?

అలాగే తెలుగు-ఇంగ్లీషు ఎంత ముఖ్యమో ఇంగ్లీషు-తెలుగు కూడా అంతే ముఖ్యమని నా ఉద్దేశం. మన దురదృష్టం.. ఇట్నుంచటు కంటే అట్నుంచిటు అర్థాల అవసరాలే ఎక్కువ ఉన్నాయి. అంచేత అదీ ముఖ్యమే! __Chaduvari 16:48, 28 మార్చి 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఓ ఆలోచన.. ఇంగ్లీషు-తెలుగు లో ఇంగ్లీషు పదానికి లింకు.. దాని సమానార్థకమైన తెలుగు పదానికి దారిమార్పు చెందుతుంది. ఆ విధంగా తెలుగు-ఇంగ్లీషు తో పాటు ఇంగ్లీషు-తెలుగును కూడా ఏకకాలంలో పెంచుకుంటూ రావచ్చు. __చదువరి 17:14, 28 మార్చి 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇంగ్లీషు-తెలుగు అన్నప్పుడు మీరు తెలుగు విక్షనరీలో ఆంగ్ల పదాల పేజీల గురించే కదా మాట్లాడుతున్నది? --వైఙాసత్య 19:37, 28 మార్చి 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఒక భాష అనువాదాలు చేర్చినా, 10 భాషల అనువాదాలు చేర్చినా విభాగము మాత్రము ఎలాగైనా ఉండాలి. చదువరి అన్నట్టు మనము కొంచెము ఆచరణయోగ్యముగా ఆలోచించి ప్రస్తుతము ఆంగ్లము, హిందీ భాషలలోకే అనువాదాలు చేద్దాము. (మూసలో అవి రెండు మాత్రమే ఉంటాయి). ఉత్సాహవంతులు తమకు ఇష్టమైన పదాన్ని మరిన్ని భాషలలోకి అనువదించ దలిస్తే వాళ్లు ఆ విభాగాన్ని ఆ పేజీలో పొడిగిస్తారు. ఇంకొక ఆలోచన..మనకు ఆంగ్లములో అర్ధాలు తెలుసు కనక ఆంగ్ల విక్షనరీ నుండి ఆ పదము యొక్క ఇతర భాషా అనువాదాలు కాపీ కొడితే ఎలా ఉంటుంది? (స్కూల్ వదిలినా బుద్ధి పోలేదు..;-) మనందరమూ ఒక సభ్యుల పట్టికలో తమకు తెలిసిన భాషలను చేర్చితే మనకున్న వనరులు తెలుస్తాయి. చదువరి User:చదువరి/పేజీ మూస ని Wiktionary:ప్రతిపాదిత మూస కు తరలిస్తే అందరూ మార్పులు చేర్పులు చేసే అవకాశము ఉంటుంది. --వైఙాసత్య 19:59, 28 మార్చి 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]