Jump to content

సింగడు అద్దంకి వెళ్లినట్టు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


సింగడు అద్దంకి వెళ్లినట్టు (సిద్దడు అద్దంకి వెళ్ళొచ్చినట్టు) - యజమానుల దగ్గర సిద్దడు పనివాడు, ఏంచెప్పినా సరిగా చేయడని అనుకొంటుంటారు. ఒక రోజు రాత్రి యజమానులు తనను ప్రొద్దున్నే అద్దంకి పంపించాలనుకోవటం విని, ఎలాగైనా మెప్పు పొందవచ్చని, అక్కడ పనేంటో తెలుసుకోకుండానే వాళ్ళు లేచే సరికి అద్దంకి వెళ్ళి వచ్చాడు. వివరం /ఉపయోగం లేకుండా ఎవరైనా వ్యక్తి పనిని చేసే సందర్భంలో ఈ సామెతను వాడతారు. అసలు సామెత " సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు " అని. దీని వివరం ఒక భార్యా భర్త పొద్దు పోయిన తరువాత రేపు సింగడిని (తమ పాలేరు) అద్దంకి పంపాలి అని అనుకోవడం విని. అద్దంకి వెళ్ళవలసిన అవసరం ఏమిటో తెలుసుకోకుండా, తెల్లవారకముందే సింగడు అద్దంకి వెళ్ళి వస్తాడు. తొందరపాటుతో అసలు విషయం తెలుసుకోకుండా నిష్ప్రయోజకరమైన పనులుచేసే వారికి ఈ సామెత వాడుతారు. రవి కుమార్ పెనమకూరి. హైదరాబాదు.