సింగినాదం జీలకర్ర
Appearance
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఒకప్పుడు జీలకర్ర వర్తకులు తమ రాకకు గుర్తుగా శ్రుంగనాదం (కొమ్ము బూర) ఊదేవారు.పాతకాలములొ జీలకర్ర వర్తకులు పడవలో వేసుకుని ఆ పడవలో కాలువలో వెళుతూ,ఏదైనా ఊరు వచ్చినప్పుడు బూర ఊదేవారట. అది విని కావలిసినవారు జీలకర్ర పడవ వచ్చిందని తెలుసుకొని కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళు. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు కూడా బూర ఊది, వచ్చిన జనాల్ని దోచుకునేవారు.ఆ విధంగా శ్రుంగనాదం-జీలకర్ర వొకటయ్యాయి. కాలక్రమాన, శ్రుంగనాదం-జీలకర్ర కాస్తా సింగినాదం జీలకర్రగా వాడుకలో మారిపొయింది.ఇలా నిజమో అబద్ధమో తెలియని మాటలను సింగినాదం జీలకర్ర అని కొట్టి పారవేస్తుంటారు.