charge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, care custody వశము, అధీనము.

  • expense, cost వ్రయము, శెలవు, వెల కూలి.
  • he bore my charges నాకు పట్టిన శెలవు అతని పెట్టుకొన్నాడు.
  • he got it free of charge వాడికి అది తేరకు వచ్చినది.
  • accuation, imputation నింద, నెపము, అపరాధము.
  • a false charge అపనింద, అపోహము, అభాండము, తప్పు ఫిర్యాదు he filed a charge against them వాండ్ల మీద ఫిర్యాదు వ్రాసి దాఖలు చేసినాడు.
  • Onset or attack ఆ క్రమణము, యెదిరింపు, ధాటి.
  • he brought his spear to the charge ఈటెతో పొడవవచ్చినాడు.
  • Commission,trust conferred, భారము, బరువు.
  • the prisoner was in my charge or, I was in charge of the prisoner ఆ ఖైది నా వశములో వుండినాడు.
  • he was in charge of the house; or, the house was in his charge ఆ యిల్లు వాడిపరముగా వుండినది I was in charge of the school in his absence వాడు లేనప్పుడు నేను ఆ పల్లె కూటము చెప్పుతూ వుంటిని.
  • his children are my charge వాడి బిడ్డలు నా పోషణలో వున్నారు.
  • of powder and ball in a gun ఘట్టించి వుండే మందుగుండు, బారు చేసి వుండే మందుగుండు.
  • he lodged the charge in my leg వాడు కాల్చిన గుండు నా కాలిలో పారినది.
  • he drow the charge of his gun ఘట్టించివుండే మందుగుండును బైటికి తీసివేసినాడు.
  • precept, command ఆజ్ఞ, a speech బిషపుగాని, న్యాయాధిపతి గాని చెప్పే బోధ.
  • the judge delivered a charge to the jury న్యాయాధిపతి జూరీలకు బోధ చేసినాడు.
  • he took charge of the house ఆ యింటిని వొప్పగించుకొన్నాడు, వశము చేసుకొన్నాడు.
  • he gave me charge of the house ఆ యింటిని నాకు వొప్పగించినాడు.

క్రియ, విశేషణం, వేయుట.

  • to put in an account పద్దు కట్టు, ఖర్చు వ్రాయుట.
  • what do you charge for this cloth? యీ గుడ్డకు యేమి వెల చెప్పుతావు.
  • he charged me very high for this దీనికి అధిక వెల కట్టినాడు, అధిక వెల అడిగినాడు.
  • he charged noting for doing this దీన్ని చేయడమునకు వాడు కూలి అడగ లేదు.
  • to accuse మోపుట, నేరము మోపుట, తప్పు మోపుట.
  • they charged him with the crime యీ నేరము వాడి మీద మోపినారు.
  • I charged him with the theft వాడు దొంగిలించినట్టు ఫిర్యాదు తీసుకొని వచ్చినాను.
  • to charge with adultery రంకు కట్టుట.
  • to attack పైబడుట, దూరుట, తాకుట.
  • the tiger charged us ఆ పులి మా మీదికి పారినది.
  • the battalion charged the enemy పటాలము శత్రుదళము మీద పడ్డది.
  • to entrust వొప్పగించుట వశము చేసుట.
  • he charged us with the prisoners ఆ కైదీలను సమావేశము చేసినాడు.
  • he charged me with the education of his sons తన కొడుకులకు చదువు చెప్పమని నాకు వొప్పగించినాడు.
  • to load a gun ఘట్టించుట, బారు చేసుట.
  • to command ఆజ్ఞాపించుట.
  • to instruct బోధీంచుట.
  • he stands charged with theft వాడి మీద దొంగతనము మోపివున్నది.
  • we were charged by the Cavalry తురుపు వచ్చి మామీద పడ్డది.
  • I am charged with the care of a large family పెద్ద కుటుంబమును కాళ్లకట్టుకొన్నాను.
  • the gun was charged with two balls ఆ తుకాపి జోడుగండ్లు బారుచేసివున్నది.
  • clouds charged with lightning మెరుపుల మయముగా వుండే మేఘములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=charge&oldid=926072" నుండి వెలికితీశారు