Jump to content

hot

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ఉష్ణమైన, కాక, వేడి.

  • the iron is hot ఇనుము కాగి వున్నది, కాలివున్నది.
  • hot close day ఉక్కగావుండే దినము.
  • a hot climate ఉష్ణదేశము ఎండ హెచ్చుగా వుండే దేశము.
  • it is very hot or sultry ఉక్కగా వున్నది, ఉమ్మదముగా వున్నది, ఉడకపోస్తున్నది.
  • a room that is hot and close ఉమ్మదముగా వుండే యిల్లు.
  • hot weather or season ఎండ కాలము, గ్రీష్మకాలము.
  • hot sunshine తీక్ష్ణమైన యెండ, బిర్రెండ.
  • hot wind నిప్పుగాలి, వడగాడ్పు.
  • hot water వేణ్నీళ్ళు.
  • the water boils or is hot నీళ్లు కాగుతున్నది.
  • the water was boiling hot నీళ్లు మసులుతూ వుండినది.
  • the water was some what hot వెచ్చగా వుండినది.
  • he made a hot fire నిప్పును బాగా మంట చేసినాడు.
  • this fire is not hot enough ఈ నిప్పు రగలడము చాలదు.
  • thetroops kept up a hot fire upon the town సిపాయీలు ఆ వూరి మీద చివచివకాల్చినారు.
  • there was a hot discussion మహాఘర్షణ జరిగినది.
  • he was in hot blood వాడు ఆగ్రహముగా వుండెను.
  • a hot engagement అఘోరమైన యుద్ధము, ప్రబలమైనయుద్ధము.
  • they were in hot pursuit of the thieves దొంగలను మహావడిగావెంబడించిరి.
  • a man of hot temper ఉగ్రుడు, తుర్యుడు.
  • I saw that he was very hot after the money ఆ రూకలకు వాడు మహా ఆతురముగా వుండేటట్టు నాకు తెలిసినది.
  • you will get into hot water with them నీకూ వాండ్లకూ విరోధము వస్తున్నది.
  • hot in lust విరహతాపముగల.
  • the hot fit of a fever జ్వరకాక, జ్వరము యొక్క వేండ్రము.
  • pepper is hot మిరియాలు కారముగా వుంటవి.

విశేషణం, (add,) this affair kept the family in hot waterfor a long time యీ సంగతిచేత ఆ కుటుంబములో చాలా కాలము కలహముగావుండెను.

  • cannot you keep out of hot water? రచ్చ చేయకుంఢావుండలేవా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hot&oldid=934228" నుండి వెలికితీశారు