Jump to content

lie

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, (falsehood) అబద్ధము, అనృతము, కల్ల.

  • she gave him the lie నీవు చెప్పినది అబద్ధమన్నది.
  • his whole conduct gives the lie to this story వాడియొక్క నడత ను చూస్తే యీ మాట అబద్ధమని తోస్తున్నది.

క్రియ, నామవాచకం, (or tell falsehood) అబద్ధము చెప్పుట, కల్లలాడుట See Lying. క్రియ, నామవాచకం, to rest పండుకొనుట, వుండుట, పడివుండుట.

  • the dog was lying on the ground ఆ కుక్కనేల పండుకొనువుండినది.
  • the corpses lay unburied పీనుగలుపూడ్చకుండా పడి వుండినవి.
  • my watch was lying on the table నా గడియారము మేజమీద చుండినది.
  • he lay sick for a month నెలదినాలు రోగముతో పడివుండినాడు.
  • his house lies west of mine వాడి యిల్లు నా యింటికి పడమట వున్నది.
  • this grief lies his heart ఈ వ్యసనము వాడి మనసున అంటివున్నది.
  • In this there lies some mistake ఇందులో కొంచెము అబద్ధము వున్నది.
  • I lies concealed అది దాగివున్నది.
  • his spear lay against the wall వాడి యీటె గోడకు ఆనించి వుండినది.
  • the sin lies at his door ఆ పాపము అతణ్ని చెందును.
  • he lay down పండుకొన్నాడు.
  • these goods may lie by for the present ప్రస్తుతము యీ సరుకులు వూరికె పడివుండని.
  • the water was lying in pools నీళ్లు మడుగులు కట్టి వుండినవి.
  • his father lies in his grave అతని తండ్రిసమాధిలో వున్నాడు.
  • much grain was lying in store శానా ధాన్యము కట్టుకడగా వుండినది.
  • they lay in ambush వాండ్లు వొడ్డుచేసుకొని వుండిరి, పొంచువేసుకొని వుండిరి.
  • as far as in me lies నా చేతనైనమట్టుకు.
  • the kings body lay in state forthree days రాజుయొక్క శవమును అలంకరించి మూడుదినాలు పెట్టివుండినది.
  • to lie in ప్రసవించుట.
  • she lay in of a son మొగబిడ్డను కన్నది.
  • a sheet to lie on పక్కదుప్పటి.
  • he lay on his back వెల్లవెలికల పండుకొని వుండినాడు.
  • he lay on his sideఒత్తిగల పండుకొని వుండినాడు.
  • he lay on his face బోర్లపండుకొని వుండినాడు.
  • the door lies open ఆ తలుపు తెరిచివున్నది.
  • It lies out of my power అది నాచేతకాదు.
  • let it lie over till to-morrow అది రేపటిదాకా వుండని.
  • this business must lie overఇది నిదానముమీద కావలసిన.
  • the ship lay to for an hour ఆ వాడ యెటూపోక గడియసేపు నిలిచిపోయినది.
  • they lie under obligations to him వాండ్లు అతనికిబద్ధులైవున్నారు.
  • he lay wait for me నాకోసరము కనిపెట్టుకొని వుండినాడు.
  • this ground lay waste for ten years ఈ నేల పదియేండ్లుగా పాడుపడి వుండినది.
  • It lies with you to relieve him వాణ్ని విడిపించవలసినది నీ భారము.
  • he lay with her దానితో పోయినాడు.

నామవాచకం, s, or Lye water కారపునీళ్ళు అనగా గుడ్డను చాయవేయడానకు ముందుగాఅద్దేకారపు నీళ్ళు.

  • or chamber lie మూత్రము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lie&oldid=936788" నుండి వెలికితీశారు