meet
స్వరూపం
== బ్రౌను నిఘంటువు నుండి[1] ==*
(file) |
(file)
క్రియ, విశేషణం, మరియు క్రియ, నామవాచకము, సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట.
- I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు.
- సందర్భించినాడు.
- my letter met him on the road నాజాబు దోవలో వాడికి అందినది, ముట్టినది.
- he appointed to meet to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు.
- the people went to meet the king రాజును యెదురుకొనడానకు పోయినారు.
- after his meeting me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట.
- he met his death there వాడికి చావు అక్కడ వుండినది.
- this rule does not meet the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు.
- as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది.
- I will meet that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను.
- the prisoner did not meet the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు.
- at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి.
- the council met in the evening సాయంకాలము సభ కూడినది.
- I put a rope of a fathom long round the tree, but the ends would not meet ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు.
- with this money I couldnot make both ends meet యీ రూకలతో దాన్ని గడపలేను.
- as the boards did not meet the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి.
- when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు.
- have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా.
- he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది.
- he met with a rebuff భంగమును పొందినాడు.
- he met with a rebuff భంగమును పొందినాడు.
- he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
విశేషణం, తగిన, తగ్గ, యుక్తమైన.
- this was meet punshment యిది తగిన శిక్ష.
- Is it meet for you to say so? యిట్లా చెప్పటము మీకు తగునా, యుక్తమా.
- it is not meet for you యిది మీకు తగదు, యుక్తము కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).