remedy
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, a medicine ఔషధము, మందు.
- they say this juice is a remedy for poison యిది విషానికి విరుగుడు అంటారు.
- this is no remedy for it దానికి యిది పరిహారము కాదు.
- there is no remedy for this యిందుకు యే వుపాయమున్ను లేదు.
- That which removes an evil నివృత్తి పరిహారము, ప్రతిక్రియ.
- this disease is without remedy యిది తీరని రోగము.
- If he wrongs you, you have your remedy at law వాడివల్ల నీవు అన్యాయమును పొందితే అది కోరట్టువారివల్ల నీకు పరిహార మవును.
- this disease is beyond remedy యిది అసాద్యమైన రోగము.
- a remedy for lust మోహోపశాంతి, మోహోపశమనము.
- a remedy for madness ఉన్మాదశమనము.
క్రియ, విశేషణం, నివారణము చేసుట, స్వస్థము చేసుట, పరిహరించుట, ఉపశమనము చేసుట.
- he tried to remedy the mischief he had done తాను చేసిన అపకారమును దిద్దుకో చూచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).