set
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ఉంచుట, పెట్టుట, నిలుపుట.
- to set a broken boneవిరిగిన యెముకను సరిగ్గా పెట్టి కట్టుట.
- to set a joint తొలగిన కీలును సరిగ్గా పెట్టుట, to set gems రత్నములు చెక్కుట.
- he set the ruby ఇన్ gold ఆ కెంపును కుందనముతో చెక్కినాడు.
- she set her heart upon this ఆపె మనస్సంతా దాని మీద పెట్టినది, దానిమీదనే ఆశగా వుండినది.
- to set a pattern మేలు బంతి పెట్టుట, మాదిరి చూపుట.
- he set them the pattern and they all became డ్రున్కర్డ్స్ వాడు తాగుబోతైనాడు గనక వాణ్ని చూచి అందరు తాగుబోతులైనారు.
- I set him ట్హే pattern and he wove the cloth వాడికి మాదిరి చూపినాను, ఆ ప్రకారము వాడు ఆ గుడ్డ నేసినాడు.
- he set them a good example తాను చక్కగా నడిచి వాండ్లునున్ను అట్లా నడిచేటట్టుచేసినాడు.
- to set a picture or frame it పటమునకు చట్టము వేసుట.
- to set a plant చెట్టు పెట్టుట.
- he set the plants thick ఆ చెట్లను దట్టముగానాటినాడు.
- he set a post at the door వాకిటి దగ్గెర స్థంభము నాటినాడు.
- to set a price on that rice ఆ బియ్యీనికి అధిక వెల కట్టినారు.
- to set a razor మంగళ కత్తి సానపెట్టుట.
- to set a saw రంపముకు కక్కుపెట్టుట.
- he set a snare వల వొడ్డినాడు.
- he set the troops in battle array ఆ దండును యుద్ధానకై సిద్ధముగా నిలిపినాడు.
- he set himself to search for the dagger ఆ కటారిని వెతక నారంభించినాడు.
- he set himself to reconcile them వాండ్లను సమాధానము చెయ్యడానకు పూనుకున్నాడు.
- he set his face against them వాండ్లకు వాడు ప్రతికూలము చేసినాడు.
- (This verb is often joined with various words, particularly prepositions, which will now be given in alphabetical order.
- ) he set about building a houseఇల్లు కట్టడానికి మొదలు పెట్టినాడు.
- he set the ree afloat ఆ చెట్టును నీళ్లలో కొట్టుకొని పోయ్యేటట్టు వేసినఅడు.
- they set him against me వాడికి నా మీద ద్వేషము పుట్టేటట్టు చేసినారు, పగ పుట్టించినారు.
- she set him against me అది వాణ్ని నా మీద రేగేటట్టు చేసినది, వాడికి నా మీద విరోధము పుట్టేటట్టు చేసినది.
- he set himself against them వాండ్లమీద తిరగబడ్డాడు, వాండ్లకు విరుద్ధముగా వుండినాడు.
- he sets the rent of the house against the debt ఆ యింటి అద్దెను అప్పుకు చెల్లుపెట్టినాడు.
- he set the business agoing ఆ పనికి మొదలుపెట్టినాడు.
- he set the clock a-గోఇన్గ్ ఆ గడియారాన్ని తిరిగేటట్టు చేసినాడు.
- to set apart or to set aside యెత్తిపెట్టుటఇ, నిలిపి పెట్టుట.
- హే set apart ten rupees for this business యీ పనికని పది రూపాయలు యెత్తి పెట్టినాడు.
- they set apart Sunday for worship ఆదివారాన్ని పూజకని నియమించినారు.
- they set the suit a side ఆ వ్యాజ్యమును తోశివేసినారు.
- can you set aside the law? చట్టమును తోసివేయగలవా.
- they set his commands at nought వాడి ఆజ్ఞను తిరస్కరించినారు.
- this sets the question at rest ఇందువల్ల ఆ సందేహము తీరుతున్నది.
- this letter set me at ease యీ జాబువచ్చినందున నాకు నెమ్మది అయినది, నా వ్యాకులము తీరినది.
- he not setting God before his eyes committed this crime తలమీద దేవుడు వున్నాడని యెంచక యీ నేరమును చేసినాడు.
- he set the money by రూకలను దాచినాడు.
- to set by దాచుట.
- he set them by the ears వాండ్లకు కలహము పెట్టినాడు.
- he setthe load down తలమూటను దించుకున్నాడు.
- he set this down in his accountయీ పద్దును తన లెక్కలో వ్రాసుకొన్నాడు.
- they set down this as false దీన్ని అబద్ధము కింద కట్టినారు.
- they set him down as a fool వాణ్ని వెర్రి వాండ్లలోచేర్చినారు.
- I set him down properly వాణ్ని బాగా ఝాడించినాను.
- to set forth ప్రకటన చేసుట.
- they set him at liberty వాణ్ని విడుదల చేసినారు.
- to set in order సవరించుట, దిద్దుట.
- he set the books in order ఆ పుస్తకములను వరసగా పెట్టినాడు, క్రమముగా పెట్టినాడు.
- to set off శృంగారించుట.
- he set the house off with pictures ఆ ఇంట్లో పటములు కట్టి శృంగారించినాడు.
- he sether off with jewels దానికి సొమ్ములు పెట్టి శృంగారించినాడు.
- he set the dogs on or upon కుక్కలను వుశికొలిపినాడు.
- this news set her all on fire ఈ సమాచారము విని దాని మనసు భగ్గుమన్నది.
- he set the jungle on fire ఆ యడవిని తగలబెట్టినాడు.
- he set an expedition on foot ఆ పనికి మొదలు పెట్టించినాడు.
- he has set his heart upon her దానిమీద ప్రాణములు విడుస్తూ వుండినాడు.
- వాడి మనసంతా దానిమీద వుండినది.
- he has set his heart upon victory గెలవపోతామా అని అదే మనసుగా వుండినాడు.
- these sour orangesset the teeth on edge యీ పుల్లనికిచ్చిలిపండ్లు తిని నాపండ్లు పులిశిపోయినది,the sound of the saw sets ones teeth on edge ఈ రంపము యొక్క ధ్వనివింటే పండ్లకు తొందరగా వుంటున్నది.
- they set a high value upon chastity పాతివ్రత్యమును ఘనముగా విచారిస్తారు.
- they set no value upon cleanlinessవాండ్లకు పారిశుధ్యము వొక లక్ష్యము లేదు.
- he set ten guineas upon the dice నూరు రూపాయలు వొడ్డినడు, పెట్టినాడు.
- when he set his eyes upon her.
- దానిమిద కన్ను వేశినప్పుడు.
- I have not set eyes upon him this month నెల్లాండ్లుగా వాణ్ని కానము, నెల్లాండ్లుగా వాడు కండ్లబడలేదు.
- he set the door open తలుపు తెరిచిపెట్టినాడు.
- he set the watch out of viewఆ గడియారమును కడగా పెట్టినాడు, దాచినాడు.
- he set these accounts out of view యీ లెక్కలను బయటపెట్టలేదు.
- setting his relations out of viewవాడి బంధుత్వమును విచారించకుండా.
- he set me right నేను పడ్డ భ్రమను పోగొట్టినాడు.
- he set the house to rights ఆ ఇంటిని చక్కపెట్టినాడు, దిద్దుబాటు చేసినాడు.
- he set the books to rights ఆ పుస్తకములను క్రమముగా పెట్టినాడు.
- that medicine set him to rights ఆ మందువల్ల వాడి వొళ్లు కుదిరినది.
- to set sail వాడ చాపలను యెత్తుట, అంకారించుట.
- the ship set sail or I set sail వాడ బయిలుదేరినది, నేను వాడ ఎక్కి పోయినాను they set great store by this medicine యీ మందును నిండా శ్లాఘిస్తారు, కొనియాడుతారు.
- they set no store by him వాన్ని లక్ష్యపెట్టరు.
- he set the song to music యీ పద్యమును పాటగా పాడేటట్టు యేర్పరచినాడు.
- he set up an image వొక విగ్రహాన్ని పెట్టినారు, ప్రతిష్టచేసినాడు.
- he set up a shop కొత్తగా అంగడి పెట్టినాడు.
- they set him up as the heir వాణ్ని బాధ్యుణ్నిగానిర్ణయించినారు.
- they set him as a creditor వాడు వొక అప్పుల వాడనికృత్రిమముగా యేర్పరచినారు.
- he set up a claim to the money ఆ రూకలుతనకు రావలసినదని వ్యాజ్యము తెచ్చినాడు.
- last year he set up a carriageపోయిన సంవత్సరము వొకబండి పెట్టుకొన్నాడు.
- he set up a loud cryబిగ్గరగా అరిచినాడు.
- they set up a laugh పకపక నవ్వినారు.
- అస్తమయము.
- అమర్చుట.
క్రియ, నామవాచకం, అస్తమించుట, అస్తమానమవుట, ప్రొద్దుగూకుట.
- when the star set ఆ నక్షత్రము అస్తమించినప్పుడు.
- when the curd sets పెరుగు పేరేటప్పుడు.
- when the fruit setస్ పిందెపట్టేటప్పుడు.
- when the wind sets form the East తూర్పుగాలి తిరిగినప్పుడు.
- the rains set in ten days ago పది దినాలకు ముందర వాన పట్టినది.
- he set off very fast but he soon slackened his pace బయిలుదేగానే వడిగా నడిచినాడు గాని అవతల నడజబ్బు పడ్డది.
- he set out in the morning తెల్లవారి బయిలుదేరనాడు.
- they set to work ఆ పనికి మొదలు బెట్టినారు, ఆరంభించినారు.
- they set to and fought for an hour ఆరంభించి గడియసేపు దాకా పోట్లాడినారు.
- there was a set to last night రాత్రి వొక జగడము జరిగినది.
- he sets up for a poet తాను ఒక కవియని బయిలుదేరినాడు.
- he set up as a cloth dealer బట్టల వర్తకము చేయనారంభించినాడు.
- he set up as a doctor వైద్యము చేయడానికి మొదలుపెట్టినాడు.
- they all set upon him అందరు వాడిమిద పడ్డారు, వాడిమీదకి దూరినారు.
part, adj.
- ఉంచబడ్డ, పెట్టబడ్డ, నాఠబడ్డ, చెక్కిన.
- the fruit is set పిందెపట్టినది.
- his eyes are set i. e. in death వాడికి నిలువుగుడ్లు పడ్డవి.
- a regulation that is set aside తోసివేయబడ్డ చట్టము.
- rubies set in gold కుందనముతో చెక్కిన కెంపులు.
- spectacles that are set in gold బంగారుతో కట్టిన ముక్కద్ధము.
- a post set in the earth నేలపాతిన స్థంభము.
- her mind is set upon going there అక్కడికి పోవలెనని మనసులో నిశ్చయముచేసుకోన్నది.
- a city set upon a hill కొండమిద కట్టిన వూరు.
నామవాచకం, s, జత a set of palanqueen bearers వొక జత బోయీలు.
- a set of jewels వొక జత సొమ్ములు a set of colothes వొక జత మేళము.
- she has a fine set of teeth దాని పండ్లవరస అందముగా వున్నది.
- they are strange set of people వాండ్లు వొక విధమైన మనుష్యులు.
- a set of verses శతకము.
- at sunset సూర్యాస్తమానమైనప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).