shift
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, మారుట, తిరుగుట.
- I shifted to that house వుండినయిల్లు విడిచి వేరే యింటికి కాపురము పోయినాను.
- I shifted from that houseఆ ఇంట్లో కాపురము చాలించుకొని లేచి వచ్చినాను.
- the wind shifted గాలి తిరిగినది.
- I cannot shift without this ఇది లేకుంటే నాకు గడవదు.
- I must shift for myself నా గతి నేను విచారించుకోవలసినది.
- they shifted for themselves తమ కూటికి తాము సంపాదించుకొన్నారు, వేరే దిక్కులేక తమంతట తాము జీవించినారు.
- the boy is now old enough to shift for himself వాడుపెద్దవాడైనాడు, వాడి పొట్ట వాడు పోసుకోగలడు.
- I cannot assist you, you must shift for yourself నేనేమీ సహాయము చేయలేను, నీ గతి నీవు విచారించుకోవలసినది.
- an infant cannot shift for itself పరుల పోషణలేక వొక బిడ్డ తనకు తానే బ్రతకనేరదు.
- a dog can always shift for itselfవొక కుక్క పరుల సహాయము లేక తనకు తానే బ్రతుక గలదు.
క్రియ, విశేషణం, మార్చుట, తిప్పుట.
- he shifted his feet నిలవడములోకాళ్ళను మార్చుకొంటూ వుండినాడు, అనగా వొక కాలిమీద కొంతసేపు మరివొక కాలిమీద కోంతసేపు నిలిచినాడు.
- he shifted his clothes బట్టలను విడిచి వేరే బట్టలను తొడుక్కున్నాడు.
- he shifted his property out of this house ఆ ఇంట్లోనుంచి సామానులను యెత్తివేసినాడు.
- he shifted his place ఆ స్థళము విడిచి మరివొక స్థళానికి పోయినాడు.
- he shifted his story ఆ కథను విడిచి వేరే వొక కథను యెత్తుకొన్నాడు.
- he often shifts his opinion వాడికి గడియకు వొక అభిప్రాయము.
- here the poet shifts the scene from India to England యిక్కడ కవి ఇండియాలో జరిగిన పనులను విడిచి ఇంగ్లండులో జరిగే పనులను చెప్పనారంభించినాడు.
నామవాచకం, s, an evasion ఉపాయము, యుక్తి.
- I did not believe him,I thought his sorry was a mere shift వాణ్ని నేను నమ్మను వాడు చెప్పినదివట్టి కుయుక్తి అని తలచినాను.
- they had no shift but this యిది తప్ప వాండ్లకు వేరేగతి లేదు.
- he was put to his shifts గతిలేక వుండినాడు,నానా కడగండ్లు బడ్డాడు.
- he made shift to do it ప్రయాసపడి యీ పనిచేసినాడు.
- he made shift to do it ప్రయాసపడి యీ పని చేసినాడు.
- he makes shift with small wages కొద్ది జీతముతో గడుపుకొంటున్నాడు.
- a womans under garment స్త్రీలు తొడుక్కొనే లోనివుడుపు, దీన్ని కంజు అనిఅంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).