spare
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to frugally పట్టిచూచుట, మన్నించుట, తప్పించుట, తప్పవిడుచుట,శిక్షించక విడుచుట, చంపకవిడుచుట, రక్షించుట, కాపాడుట.
- if you spare your money you will ruin the business నీవు రూకలను పట్టి చూస్తే ఆ పని చెడిపోను.
- he spared no money in building the house యీ యింటిని కట్టడములో వాడు రూకలను పట్టి చూడలేదు.
- he did not spare a single soul వొక ప్రాణినైనా విడవలేదు.
- he always spares his servants but he never spares his wifeపనివాండ్లకు దయగా నడిపిస్తాడు గాని పెండ్లాన్ని వేయించి బొక్క లాడుతాడు.
- he never spares me నా మీద యెప్పుడు దయలేదు.
- can you spareme that book ఆ పుస్తకమును నాకు యివ్వడములో తమకేమీ తొందరలేదుగదా, ఆ పుస్తకాన్ని యివ్వడములో తమకేమీ యిబ్బంది లేకుండా వుంటే యివ్వండి.
- I could ill spare the money but I gave it to him ఆరూకలను వాడికి యివ్వడమువల్ల నాకు నిండా సంకటమైనప్పటికిన్ని యిచ్చినాను.
- I have three horses I can easily spare one నాకు మూడు గుర్రాలు వున్నవి వొకటిని యిస్తే నాకేమీ తొందరలేదు.
- the king spared him రాజు వాణ్ని చంపక విడిచినాడు.
- the king spared his life but seized his wealth రాజు వాడి ప్రాణాన్ని మన్నించి వాడి ధనమును గుంజుకొన్నాడు.
- he used my horse and spared his own నా గుర్రాన్ని సవారిచేశి తనగుర్రాన్ని వూరికే వుంచినాడు.
- to spare my horse I went two miles on foot నా గుర్రానికి తొందరలేకుండా నేను రెండు గడియల దూరము నడిచి పోయినాను.
- you ought to punish the boy; why do you spare him ? వాణ్ని శిక్షించక యేల వురికే విడిచిపెట్టుతావు.
- I will spare you the trouble of doing it; I will do it myself తమ కేందుకు తొందర నేనే చేస్తాను.
- God spared my life దేవడు నా ప్రాణాన్నిమన్నించినాడు.
- I cannot spare him to-morrow వాడు లేకుండా రేపు నాకు గడవదు.
- if you will spare me an hour I will explain the account to you తమరు గడియసేపు తీరికచేసుకొంటే ఆ లెక్కను తమకు తెలియచేస్తాను.
- if you will spare me for an hour I will go నన్ను గడియసేపు విడిస్తే నేను పోతాను, నాకు గడియసేపుశలవు ఇస్త పోతాను.
- I cannot spare a moment to-day నేడు నాకు నిమిషమైనా తీరదు.
- the post spares us a great deal of trouble యీ తపాలువల్ల మాకు అనేక తొందరలులేకుండా పోతున్నవి.
- he that spares the rod spoils the child యెవడైతే శిక్షించడో వాడుబిడ్డను చెరుపుతాడు.
- he spared neither trouble nor time in doing this దీన్ని చేయడములో యెంత తొందరగా వుండినా యెంత సావకాశము అయినా కానియ్యని వుండినాడు.
- spare my blushes I cannot tell that story ఆ సంగతిని చెప్పడానకు నాకు సిగ్గుగా వున్నది.
- wishing to spare him I did not tell the story పడి వుంటాడని నేనా సంగతిని చెప్పలేదు.
- if God spares me another year దేవుడు యింకొక సంవత్సరము భూమిలో నన్ను వుండనిస్తే.
- I wish to spare you in this business తమకు యీ తొందర యెందుకో.
- he spares no one వాడు వొకరినీ విడవడు.
- O spare me this sad story ఆ పాడు కథను నాతోచెప్పవద్దు.
- I wished to spare her feelings and therefore I did not tell this story అది దుఃఖ పడబోతున్నదని యీ సంగతిని దానితో చెప్పలేదు.
- you, may spare your censrues he is dead నీ చివాట్లు యెందుకు వాడు చచ్చినాడే, వాడు చచ్చినాడు యిక నీ చీవాట్లు మానుకో.
- God has spared him దేవుడు వాన్ని రక్షించినాడు, బ్రతికించినాడు.
- spare your jokes నీ యెగతాళిచాలించు.
- to have unemployed అధికముగా వుండుట.
- I spared the horse because I wanted him next day రేపటికి కావలసి వున్నది గనుక నేడుగుర్రానికి నిండా తొందర యివ్వలేదు.
- he lent me all the money he could spare వాడికి వుపయోగము లేకుండా వుండే రూకలనంతా నాకు యిచ్చి పెట్టినాడు.
- he did not spare himself in this business యిందులో వంచన లేకుండా పాటుబడ్డాడు.
- his coming spared me the trouble of going ఆయన రావడమువల్ల నేను పోవలసిన తొందర తప్పినది.
- we might have spared our comingమనము వచ్చిన్నీ వ్యర్థము.
- I have no horse to spare నా దగ్గిర గుర్రము అధికముగా లేదు.
- if you have pens to spare give them to me నీ దగ్గిరపేనాలు అధికముగా వుంటే నాకు యియ్యి.
- if you have ten rupees to spare lend it me మీ దగ్గిర మిగతగా పదిరూపాయిలు వుంటే నాకు యివ్వండి.
- I have a room to spare నాకు అధికముగా వొక గది వున్నది.
- there is cloth enough but there is none to spare గుడ్డలు యెన్ని కావలసినవో అన్నే వున్నవి గాని అధికముగా లేవు.
- to spare his eyes he used green glasses కంటికి తొందర లేకుండా వుండడానకై పచ్చ అద్దములు వేసుకొన్నాడు.
- to spare my horsess feet I shod them గుర్రాల కాళ్లకు తొందర లేకుండా వుండడానకై లాడములు కట్టించినాను.
- by saving and sparing he collected much money కడుపు పట్టి దుడ్డుదుడ్డుగా నిండా రూకలు చేర్చినాడు.
విశేషణం, thin, lean సన్నపాటి, బక్కచిక్కిన, బక్కపలచని,కృశించిన.
- a spare person బక్కచిక్కినవాడు, పలాచటివాడు.
- spare dietమితాహారము.
- scaty, not abundant మితమైన, మట్టైన.
- he was spare of speech వాడు మితభాషిగా వుండినాడు.
- superfluous, unwanted మిగతగా వుండే, అధికముగా వుండే.
- he gives all his spare money to his brotherతనకు మించివుండే రూకలను తన తమ్ముడికి యిస్తాడు.
- each is mounted on a horse and has a spare horse at his side తలా వొక గుర్రముమీద యెక్కుకొని పక్కన వొక్కొక్క విడి గుర్రమును పెట్టుకుని యుండినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).