sphere
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a globe, orb గోళము, ఉండ, మండలము, చక్రము.
- the sphere of the universe బ్రహ్మాండము.
- the sphere of the earth భూగోళము, భూచక్రము, భూవలయము.
- the sphere of the eye కనుగుడ్డు.
- the celestial sphere ఖగోళము.
- the terrestrial sphere భూగోళము.
- at dawn the lamp contract the sphere of their radiance ఉదయకాలములో దీపము యొక్క ప్రకాశము సంకోచిస్తున్నది.
- Raghuvams. 5.74. స్వకిరణపరివేషోద్భేద శూన్యః ప్రదీపాః.
- province; compass of knowledge or action శక్తి, అధికారము.
- he is out of his proper sphere వాడు తాను వుండవలసిన స్తానము తప్పివున్నాడు, how can you teach this artto a child? it is quite out of his sphere యీ శాస్త్రమును నీవుబిడ్డకు యెట్లా నేర్పబోతున్నావు యిది వాని శక్తిని మించి యున్నది.
- a childrecolects all that is with the sphere of his observation బిడ్డకు తెలుసుకొనే శక్తిలోబడ్డ వాటినంతా జ్ఞాపకము పెట్టుకొంటున్నది.
- mathematicks is quite beyond their sphere మహాగణితము వారి శక్తిని మించి వున్నది, వారికి గ్రాహ్యమయ్యేది కాదు.
- that affair is out of my sphere ఆ కార్యము నా శక్తిని మించి వున్నది.
- ఆ కార్యమును చేశే శక్తి నాకు లేదు.
- thefts and murders are within the Magistrates sphere but suits for land or debt are beyond his sphere దొంగతనములు హత్యలు విచారించే అధికారము మేజస్ట్రీటు వారికి వున్నది గాని నేలలు అప్పులు వీటిని విచారించే అధికారము వారికి లేదు.
- the music of the spheres దేవగానము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).