Jump to content

turn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, తిప్పుట, మళ్ళించుట.

 • a very little will turn the scales రవంతలోమొగ్గేటట్టు చేసును.
 • this turned the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది.
 • this turned the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.
 • to turn in a lathe తరిమెను బెట్టుట.
 • he turned the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు.
 • he turned this in his mind for three days దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు.
 • such witnesses can turn black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు.
 • he turned the corner and ran away ఆ మూల తిరిగి పారిపోయినాడు.
 • he turned a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు.
 • cutting wood with a razor will turn it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను.
 • wine turns a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది.
 • riches and pride will turn a man's head ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది.
 • as soon as he turned his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే.
 • this physic turned his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది.
 • they have now turned the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు.
 • he accused me, but I soon turned the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను.
 • he turned his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.
 • he turned them away వాండ్లను తోసివేసినాడు.
 • he turned them back వాండ్లను మళ్లించినాడు.
 • they turned their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు.
 • he turned his hand back చేతిని వెనక్కు తీసుకొన్నాడు.
 • he turned the leaf down ఆకును మడిచినాడు.
 • he turned the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు.
 • he turned the cloth into money ఆ గుడ్డలను రూకలు చేసినాడు.
 • he turned this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు.
 • he turned the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు.
 • he turned the poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు.
 • they turned his words into-ridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు.
 • he turned off his servants తనపనివాండ్లను తోశివేసినాడు.
 • he turned off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు.
 • heturned them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు.
 • he turned the leaf over ఆ పత్రాన్ని తిరగవేసినాడు.
 • he turned the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు.
 • he turned the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు.
 • he turned up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.

క్రియ, నామవాచకం, తిరుగుట, మళ్లుట.

 • not knowing which way to turn యెటూ తోచక.
 • my foot turned and I fell నా కాలు జారిపడ్డాను.
 • because his head was turningవాడికి తల తిరుగుతూ వుండి నందున.
 • because his stomach turned వాడికి వాంతిఅయినది గనక.
 • he turned to the lady and said ఆపెతట్టు తిరిగి చెప్పినాడు.
 • he turned to a passage in the poem ఆ కావ్యములో వొక వాక్య మెత్తినాడు.
 • I shall now turnto that question యిప్పుడు ఆ ప్రమేయమును గురించి కొంచెము చెప్పుతున్నాను.
 • the wood soon turned into earth ఆ కొయ్య కొంచెము దినాలలో మన్నయి పోయినది he turned into the shape of a woman అడదైపోయినాడు.
 • he turned aside and sat down పక్కకు తొలిగిపోయి కూర్చున్నాడు.
 • because the silver turned black ఆ వెండినల్లపారినందున, నల్లపడిపోయినందున.
 • after his head turned grey వాడి తల నెరిసినతర్వాత.
 • his face turned pale వాడి ముఖము తెల్లపారినది.
 • it turned sourపులిశిపోయినది.
 • this story, turned out true ఆ కథ నిజమైనది.
 • at last he turned out a rogue తుదకు దొంగ అయిపోయినాడు.
 • it turned out to be gold అది బంగారైనట్టు బయిటపడ్డది, యేర్పడ్డది.
 • you see how it turned out యేమి సంభవించినది చూడు.
 • I cannot tell how the law suit turned out ఆ వ్యాజ్యము యేమిగా తేలినదో నేను యెరగను.
 • it turned out well మంచిదిగా తీరినది.
 • at last it turned out that they were relations తుదకువాండ్లు బంధువులైనట్టు బయిటపడ్డది.
 • to turn over పొల్లుట.
 • at last a witness turned up తుదకు వొక సాక్షి చిక్కినాడు.
 • they turned upon him in anger వాని మీద రేగినారు.
 • when their eyes turned upon me వాండ్ల కండ్లు నా మీద పారేటప్పటికి.
 • the conversationturn ed upon poetry మాటలలో కావ్యప్రశంస వచ్చినది.

నామవాచకం, s, తిరగడము, సారి, తేప, మాటు, ఆ వృత్తి, వంతు, కృత్యము,క్రియ,పని.

 • he did me a bad turn నాకు అపకారము చేసినాడు.
 • matters took a bad turn పనిచెడిపొయ్యేగతిగా వున్నది.
 • matters took a good turn ఆ పని దోవకు వచ్చినది.
 • he did me a good turn వాడు నాకు వుపకారము చేసినాడు.
 • the turn the affair took ఆ పనికివచ్చిన గతి.
 • he took as much as served his turn వానికి కావలసినది యెంతో అంతతీసుకొన్నాడు.
 • the tide is on the turn యిప్పుడు పోటు సమయముగా వున్నది, పాటుసమయముగా వున్నది.
 • the disease is on the turn వ్యాధి తిరుగు ముఖముగా వున్నది,అభిముఖముగా వున్నది.
 • this was a turn of the times యిది కాలము చేత వచ్చినవైపరీత్యము.
 • the turn of an epigram పద్యము యొక్క స్వారస్యము.
 • do you observe the turn of this verse ? యీ పద్యము యొక్క శయ్య చూచినావా.
 • he took a turnand came back అట్లా తిరిగి మళ్లీ వచ్చినాడు.
 • his turn వాని వంతు.
 • my turn is to-day,his turn is to-morrow నేడు నా వంతు రేపు వాని వంతు.
 • they were all of them kings in their turn వాడివాడి వంతు వచ్చినప్పుడు వాడు వాడు రాజుగా వుండినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=turn&oldid=965188" నుండి వెలికితీశారు