Jump to content

పట్టు

విక్షనరీ నుండి

పట్టు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
రంగులద్దిన పట్టునూలు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అర్ధము;-పట్టు అంటే పట్టు పురుగుగూడు నుండి లభించే ఒక విధమైన సహజమైన నూలుతో నేసిన వస్త్రము.
  2. అర్ధము;-పట్టు అంటే ఔషధ లేపనము. పట్టు వేయుట
  3. అర్ధము;-పట్టు అంటే శరీర శక్తిని ఉపయోగించి వస్తువులూ మొదలైన వాటిని గట్టిగా పట్టుకోవడం. [వాడిది ఉడుం పట్టు]
  4. అర్ధము;-పట్టు అంటే అనుకున్నది జరిగితీరాలన్న మాటపట్టు. ఇది విపరీతమైనప్పుడు మూర్ఖపుపట్టు, మంకుపట్టు, మొండిపట్టు అని అనడం సహజము.
  5. అర్ధము;- చేయడానికి ఇచ్ఛగించని పనిని పట్టింపు అంటారు.
  6. అర్ధము;- ఒక వస్తువును పట్టుకోవడానికి అనుకూలము కుదురుట. ఉదా;-పట్టుచిక్కుట./పట్టుబట్టుట
  7. పట్టువదలని విక్ర మార్కుడు
  8. దీనిని ఒక పట్టు పట్టాలి.
  9. పట్టుకుంటే పది వేలు .... ఇదొక సినిమా పేరు / పట్టు పట్ట రాదు .... పట్టి విడువరాదు

పూఁత/స్థానము

నానార్థాలు
  1. పట్టుకోవటము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. విడుపు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

1. వాడిది ఉడుం పట్టు: చాల గట్టిగా పట్టుకో గలడు. 2. వాడు పట్టిన పట్టు వదలడు. పట్టుదల గల వాడు. 3. ఒక పాటలో పద ప్రయోగము: సరదా సరదా సిగరెట్టు ..... అనే పాటలో పట్టు పట్టి ఒక దమ్ములాగితే స్వర్గానికి అది తొలి మెట్టు......

  1. .పట్టుదల చేయు; "వ. అనిన నధర్మాచరణంబున కింత పట్టిపెనంగం దగునె." భార. ఉద్యో. ౪, ఆ.
  2. కలుగు. (జొన్నవెన్ను తీసినది ఇంకగింజ పట్టలేదు. వీనికి క్రొవ్వు పట్టినది.)
  3. ఈ యుంగరము నా వ్రేలు పట్టదు, ఈగోనె యెంతబియ్యము పట్టును. ఇత్యాది స్థలములయందు పట్టు అనుక్రియ గ్రహణార్థకమనియే యెఱుంగునది.
  4. పిసుకు; = నాకు నడుము పట్టుము.
  5. అవకాశము; = "వ. కాలక్రమంబున నచ్చోట దిరుగం బట్టు గానక." భార. ఆర. ౪, ఆ.
  • కార్యపుమాటలిట్టివే, పతిదెసఁ గూర్మి వాపుటకుఁ బట్టుగ నెక్కువతక్కువంచు ను, న్నతులగు మేదినీశులకు నానగఁ బల్కుటగాక

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పట్టు&oldid=956603" నుండి వెలికితీశారు