అక్షతలు
Appearance
అక్షతలు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకము.
- వ్యుత్పత్తి
అ(=కానివి)+క్షతలు(=దెబ్బతినినవి,విరగినవి).
- బహువచనం లేక ఏక వచనం
నిత్యబహువచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అక్షతలుఅంటే పసుపు కలిపిన బియ్యము.పూజకు,పెద్దల చేతి నుండి దీవెనలు అందుకునే సమయములో పిన్నల తల మీద చల్లబడేవి .వీటికి ఏవిధంగానూ దెబ్బతినని బియ్యం గింజలు వాడాలి.అష్ట అర్ఘ్యాలు లలో ఇది ఒకటి.అక్షింతలు అనే రూపం వ్యావహారికం.
- అష్టపూజాంగ వస్తువులలో ఒకటి. అవి. 1. ముగ్గులు. 2. సుగంధము. 3. అక్షతలు. 4. పుష్పములు. 5. ధూపమ. 6. దీపము. 7. ఉపహారము. 8. తాంబూలమ.
- అక్షింతలు. శుభకార్యములందును, పూజలందును ఉపయోగించునట్టి పసుపు (కొన్నిచోట్ల కుంకుమ) కలిపిన బియ్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కర్మవాసనలకు దూరంగా ఉండటమే అక్షతలు.