అనత్త
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంస్కృత పదం అనాత్మ. బౌద్ధానికి అనాత్మవాదం పునాది. ఆత్మ లేకపోవడం అని వాచ్యార్థం. ఆత్మ కానిది అని కూడా అర్థం. శరీరంలో గానీ, చిత్తవృత్తుల పరిధిలోగానీ, ఈ రెండిటికీ వెలుపల గానీ ఆత్మ అనేదేమీ లేదని బౌద్ధ సిద్ధాంతాలు వివరిస్తాయి. ఐతే, కర్మ ఫలితాన్ని, పునర్జన్మను విశ్వసించే బౌద్ధం ఆత్మను ఎలా ఒప్పుకోదనే ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది. ఆత్మ లేనప్పుడు తిరిగి జన్మించేది ఏది? బుద్ధుడు ఆత్మ ఉన్నదా, లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేదని కొన్ని బౌద్ధ గ్రంథాలలో ఉంది. ప్రశ్నలను ఆయన నాలుగు విధాలుగా వర్గీకరించారు. మొదటిది- అవుననో, కాదనో సమాధానం చెప్పదగినవి. రెండవది- ప్రశ్నలో ప్రతి పదాన్ని చర్చించి, విశ్లేషణాత్మకంగా సమాధానం చెప్పదగినవి. మూడవది- ప్రశ్నకు ప్రశ్నరూపంగానే సమాధానం చెప్పదగినవి. నాలుగవ తరహా ప్రశ్నలు- సమాధానం చెప్పనవసరం లేనివి. ఆత్మకు సంబంధించిన ప్రశ్నకు జవాబు చెప్పడం దుఃఖ నివృత్తికి దోహదం చేస్తుందా అని ప్రశ్నించుకొంటే చేయదనే సమాధానమే వస్తుంది. అంతేగాక, దుఃఖాన్ని తొలగించే ప్రయత్నంలో ప్రతిబంధకాలు కూడా ఏర్పడవచ్చు. కనుక సమాధానం అనవసరమని స్పష్టమవుతుంది. ఇలా వివరణ ఇచ్చిన వారిలో ఒకరు ఠానిస్సరో భిక్కు. ఐతే, బౌద్ధ సిద్ధాంతాలకు వ్యాఖ్యానాలు చెప్పినవారు కొందరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఉదాహరణకు నారద థేర అనే రచయిత వాదం ఈ విధంగా ఉంటుంది: ‘‘ఒక జన్మలో చేసిన కర్మలన్నింటి ఫలితం మరో జన్మకు కారణం అవుతుంది. (వైదిక పరిభాషలో ‘సంచితం’ అనే పదం ఇంచుమించు ఇదే భావాన్ని తెలియజేస్తుంది.) దేహం వదలిన అనంతరం కర్మఫలం అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మరేదైనా తగిన దేహాన్ని ధరిస్తుంది. అలాంటి కర్మ ఫలానికి రూపం లేదు. మనిషి అనుక్షణం మరణిస్తూనే ఉంటాడు, తిరిగి మరుక్షణం జీవిస్తుంటాడు. అదే శరీరం, అదే మనస్సు ఐనప్పటికీ ఆత్మ అనేదానితో నిమిత్తం లేకుండా క్షణక్షణం మనిషి పరిణామానికి లోనవుతూనే ఉన్నాడు’’. ఈ క్షణంలో శరీరం తరువాత క్షణంలో కనిపించనంత సూక్ష్మంగా మార్పు చెందుతున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు