Jump to content

అమృతమథనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కృతయుగమున ఒకప్పుడు దేవతులును అసురులును కూడుకొని మందరపర్వతము కవ్వముగాచేసి దానిక్రిందికి ఆధారముగ విష్ణువును ప్రార్థించి కూర్మముగా నునిచి వాసుకిని కవ్వపుత్రాడుగా అమర్చి చిలికిరి. అందు తొలుత విషముపుట్టి నాలుగుదిక్కుల నిప్పులుచల్లుచు వ్యాపింపఁగా దానిని రుద్రుఁడుమ్రింగి గొంతులోపల కదలకుండ నిలిపెను. మఱియును అందు లక్ష్మి, చంద్రుఁడు, ఉచ్చైశ్రవము, కౌస్తుభము, పారిజాతము ,కల్పవృక్షములు, కామధేనువు, అమృతమును, కమండలమునందు ఉంచికొనిన వైద్యశాస్త్రగురువు అగు ధన్వంతరియు పుట్టిరి. [ఇంతకుముందు ఒకప్పుడు ఐరావతమును ఎక్కుకొని ఇంద్రుఁడు పోవుచుండ, అతనికి ఐశ్వర్యప్రదాయకమయిన ఒక పూలదండను దుర్వాసుఁడు ఇయ్య, దానిని తగినట్లు గౌరవముగా ఇంద్రుఁడు పుచ్చుకొననందున, అతనికి కోపముకలిగి ఇంద్రునకును దేవతలకును ఐశ్వర్య పదవితప్పి పోవునట్లు శపియించెను. అందుమీఁద దైత్యులు దేవతలను బలహీనులుగ ఎఱింగి తొందరపెట్ట, దేవతలు పోయి విష్ణువుతో మొరలిడిరి. అపుడు విష్ణువు దేవతలకు బలముకలుగఁజేయుటకై పాలసముద్రమును చిలికి అమృతము వారికిప్పించెను, అని పురాణప్రసిద్ధము.]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]