అవిద్య
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జ్ఞానం లేకపోవడమని సామాన్యార్థం. వివిధ తత్త్వవిదులు వివిధ రకాలుగా అవిద్యను నిర్వచిస్తారు. అద్వైతులు మాయ అంటారు. ఈ మాయవల్లనే నిర్విశేష చిన్మాత్రము, సత్యము అగు బ్రహ్మమునందు మిథ్య అగు జగత్తు వ్యక్తమవుతున్నది. తత్త్వజ్ఞానం లేకపోవడం అని విశిష్టాద్వైతులు అంటారు. ‘చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు’ అనే మూడు తత్త్వాలకు గల పరస్పర సంబంధం తెలియకపోవడం వల్ల ఆత్మలు బద్ధావస్థను పొందుతున్నవి. ‘క్షణికాలను స్థిరములుగా తలచడం’ అని బౌద్ధులు అంటారు. జ్ఞానం లేకపోవడం, ఎఱుక లేకపోవడం అని నైయాయికులు, జ్ఞానం ఇంకా కలగని జ్ఞాన ప్రాగభావ అవస్థ అని సాంఖ్యాదులు అంటారు. (శ్రీ. సూ. ఆం. ని.) పరమాత్మవు, అసంసారివి అయివుండి సంసారివను కోవడం, అకర్తవైయుండి కర్తవనుకోవడం, అభోక్తవై యుండి భోక్తవనీ, నిత్యుడవై యుండి అనిత్యుడవనీ అనుకోవడం అవిద్య (శంకరుల ఉపదేశ సాహస్రి). అనిత్యం, అశుచి, దుఃఖం, అనాత్మలను నిత్యం, శుచి, సుఖం, ఆత్మ అనుకోవడం అవిద్య అని పతంజలి యోగ సూత్రాలలో సాధనయోగంలోని ఐదవ సూత్రం తెలియజేస్తున్నది. (అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచి సుఖాత్మ ఖ్యాతిర విద్యా)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు