ఆంగ్లపదము

విక్షనరీ నుండి

మూడు శాతాబ్ధాలకంటే అధికంగా సాగిన ఆంగ్లేయ పరిపాలన కారణంగా నిత్యజీవిత గమనంలో కలగలసిన ఆంగ్లపదాలను ఇక్కడ పొందు పరచబడ్డాయి. ఈ పదాలు నిజంగా తెలుగు పదాలేమోనని అని భ్రమింప చేసేలాంటి పదాలు అనేకం మన జీవితాలలో కలిసి పోయాయి. ఇంకా వాటికి ప్రత్యామ్నాయ పదాలు మనం సృష్టించ లేదు. సృష్టించినా అవి ఇప్పటి పదాలలా జనబాహుళ్యం స్వీకరించడం వాడకంలోకి రావడం కష్టమే. దేశ సరిహద్దులు దాటి ప్రపంచం అంతా విస్తరించిన ఆంధ్రులకు ఆంగ్ల భాషతో ఉన్న అనుబంధం అలాంటిది.