ఐరావతం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

[హిందూ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

[హిందూ]

ఇంద్రుని ఏనుగు. ఇది సముద్రం నుంచి పుట్టినదని ఐతిహ్యం. (దీనిని ఐరావణం అని కూడా అంటారు)
వంపులేని ఇంద్ర ధనుస్సు.
దేవయానమని కూడా శ్రీ. సూ. ఆం. ని. వివరణ. ఆకాశంలో కనిపించే అశ్విని, భరణి మొదలైన నక్షత్రాలు 27. వీటిని తొమ్మిదేసిగా మూడు భాగాలు చేస్తే వాటికి వేర్వేరు పేర్లు ఏర్పడ్డాయి. అశ్విని నుంచి ఆశ్లేష వరకు మొత్తం తొమ్మిది నక్షత్రాలు ఒక నవకం. దీనికి ఐరా వతమనీ, ఉత్తర మార్గమనీ, దేవయానమనీ పేర్లు ఉన్నాయి. ఈ నవకంలోనూ మూడు వీథులు ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల త్రికం (మూడు) నాగవీథి. రోహిణి, మృగశిర, ఆర్ద్ర నక్షత్ర త్రికం అజవీథి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష త్రికం ఐరావత వీథి. మఘ నుంచి జ్యేష్ఠ వరకు గల తొమ్మిది నక్షత్రాల నవకాన్ని జారద్గవమనీ, మధ్యమ మార్గమనీ, యోగియానమనీ అన్నారు. ఇందులోనూ మఘ, పుబ్బ, ఉత్తర త్రికం ఆర్షవీథి. హస్త, చిత్త, స్వాతి నక్షత్రాల త్రికం గోవీథి. మూల నుంచి రేవతి వరకు గల మిగతా తొమ్మిది నక్షత్రాల నవకాన్ని వైశ్వానరమనీ, దక్షిణ మార్గమనీ, పితృయానమనీ అన్నారు. ఇందులోనూ మూడు వీథులు ఉన్నాయి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల త్రికం గజవీథి. శ్రవణం, ధనిష్ఠ, శతభిషం అనే నక్షత్రాల త్రికం మృగవీథి. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల త్రికాన్ని వైశ్వానర వీథి అన్నారు. 2. కద్రువ కుమారుడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఐరావతం&oldid=904399" నుండి వెలికితీశారు