కుమారస్వామి
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ.
- విశేషణము
- కుమారస్వామి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- శివుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి. దేవతలకు సేనానాయకుడు. వాహనం నెమలి. అయుధం శక్తి.
- కుమారస్వామి శివుని కొమారులలో ఒకఁడు. దేవతలకు సేనానాయకుఁడు. మఱియు ఇతనికి కార్తికేయుఁడు, మహాసేనుఁడు, శరజన్ముఁడు, షడాసనుఁడు, పార్వతీనందనుఁడు, తారకజిత్తు, సుబ్రహ్మణ్యుఁడు అని అనేక నామములు కలవు. ఇతనికి వాహనము నెమలి. శక్తి ఆయుధము. పార్వతీపరమేశ్వరులు ఏకాంతమున ఉండువేళ శివుని చేష్టలను అరయుటకై అగ్ని శుకరూపంబు తాల్చి జాలరంధ్రములదారిని అంతఃపురము చొచ్చిన అది పార్వతి ఎఱిఁగి సిగ్గుచే తొలఁగి చనియెను. శివుఁడును శుకరూపి అయిన అగ్నిని కాంచి కోపగించి అప్పుడు పతనమయిన తన రేతస్సును అగ్నిని పానముచేయుము అనెను. అగ్ని దానిని భరింపఁజాలక శరవణమునందు విడువ అందుండి కుమారస్వామి పుట్టెను. (చూ|| పార్వతి.) కొందఱు ఇతనిని అగ్నికి జనించినవాఁడు అని చెప్పుదురు. (చూ|| కృత్తికాదేవి.) కుమారస్వామి పుత్రులు శాఖుఁడు, విశాఖుఁడు, నైగమేషుఁడు, పృష్ఠజుఁడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు