జడ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
జడలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జడ ఒక శిగ అలంకరణ. వెంట్రుకలను పరామర్శించడానికి చిక్కు పడకుండా కాపాడడానికి అనవసరమైన ప్రదేశాలలో రాలకుండా ఉండడానికి అందం కొరకు జడగా అల్లబడుతుంది. ఎక్కడో కొందరు పురుషులు వెంట్రుకలను అల్లుకున్నా. ఇది ఎక్కువగా స్త్రీల అలంకారమే. పురాతన యూరేపియన్లలలో ఈ అలంకరణ చోటు చేసుకున్నా ఇప్పుడు వారిలో ఈ అలంకరణ కనుమరుగైంది. ప్రత్యేక ప్రదర్శనలకు ఇది పరిమితమైంది. దక్షిణ ఆసియా దేశాలలలో జడకు ప్రాముఖ్యత అధికమే కాని ఆధునిక చైనా, జపాను, సింగపూరు, మలేషియా వాసులలో కూడా ఈ అలంకరణ కనుమరుగై ప్రదర్శనలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటికీ భారతీయ జన బాహుళ్యంలో భారతీయ స్త్రీల సాధారణ జీవితంలో ఈ అలంకరణ కొనసాగుతుంది. దక్షిణ ఆఫ్రికన్ కొండ జాతులలో స్త్రీ పురుష భేదం లేకుండా వివిధ ప్రత్యేక రూపాలలో జడ అలంకరణ ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వేణి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: జడలో మల్లె పూలు జాతర చేస్తున్నాయి. (ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి... అనే పాటలో)