దింపుడుగాలం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రూ: దింపుడుగళ్ళం
- శవ యాత్రలో గమ్యం చేరే లోపు మద్యలో ఒకసరి శవాన్ని దించి అతని పేరు పెట్టి చెవిలో పిలుస్తారు అతడు బ్రతికి లేస్తాడనే ఆశతో దానినే దింపుడుగళ్ళం/దింపుడుగాలం. అని అంటారు.
పూర్వకాలంలో మనిషి మరణం ఒక మిస్టిరీగా వుండేది. మరణాలు చాల ఎక్కువ. మరణాలకు కారణం చాల ఎక్కువ. అసలు ఆ మనిషి నిజంగా మరణించాడా లేదా అలా అచేతనంగా పడి వున్నాడా తెలుసుకోవడానికి శాస్త్రీయ పరిజ్ఞానము అంతగా అభి వృద్ధి చెందలేదు. కనుక ఆ విషయం కనుక్కోవడానికి ఆ రోజుల్లో అనేక పద్ధతులు అవలంబించేవారు. అందులో ఇది ఒకటి. విశేషమేమంటే............ ఆ రోజుల్లో పొరబాటున చనిపోయాడనుకున్న వ్యక్తి ఇటు వంటి ప్రక్రియల వలన తిరిగి బ్రతికి బట్ట కట్టిన ఉదంతాలు చాల వున్నాయి. ఈ రోజుల్లో పలాన వ్వక్తి నిజంగా చనిపోయాడా లేదా అనే విషయాన్ని వైధ్యులు పరీక్షించి నిర్థారించినా....... పాతకాలం నాటి సామాజిక పద్దతుల ఈ నాటికీ అవలంబిస్తున్నారు. అలా ఆయా పద్దతులను అవలంబించక పోతే ........ అదేదో తప్పు చేసి నట్లు...... దాని వలన ఏదో అరిష్టం జరుగుతుందని మూడ నమ్మకము ప్రజలలో ప్రభలంగా వున్నది. అందులో భాగంగా ఇటు వంటి తంతు జరుపుతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు