Jump to content

నాంది

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము/ విశేషణము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • దేవతలు బ్రాహ్మణులు చేయునట్టి ఆశీర్వాదము
నానార్థాలు
  • నాటక ప్రారంభం నకు ముందు జరిపెడిమంగళము
  • భేరి(drum)
  • ఇది సంస్కృత పదం. దేవతలను ఆనందింప జేస్తుంది కాన నాంది అయిందని సూర్యారాయాంధ్ర నిఘంటువు చెప్తుంది. ఆనందం, సంతోషం, సమృద్ధి, ఒకపని మొదలు పెట్టేటప్పుడు చేసే దేవతా స్తవం, నాటకం మొదలు పెట్తూ చదివే శ్లోకం పెద్దలు చేసే ఆసీర్వాదం, భేరి మొదలైన అర్థాలు ఆ నిఘంటువే సమకూర్చింది. సంస్కృత నాటకాల్లో నాందీ శ్లోకంతో మొదలయ్యేవి కొన్ని, మరికొన్నిటిలో నాంది కాగానే సూత్ర ధారుడు ప్రవేశించి ఆ నాటకాన్ని గురించి, దాన్ని రాసిన వ్వక్తిని గురించి ప్రస్తావిస్తాడు. ఆ భాగాన్ని ప్రస్తావన అంటారు. ఈ రెంటినీ కలిపి నాందీ ప్రస్తావనలు చేసారు. వంటి ప్రయోగాలు వాడుకలోకి వచ్చాయి. అందువల్ల నాంది కాగానే నాటకం మొదలవుతుందని, నాటకానికి మొదలు నాంది అని అర్థమయింది. అందువల్ల నాందీ వాచకమం మొదలు పెట్టారు. నాంది చెప్పారు/చదివారు/ . ఈ పనికి నాంది పలుగుతున్నాం వంటి ప్రయోగాలు వాడుకలోకి వచ్చాయి. ఇప్పుడెవరూ ఈ మాటను ఆశీర్వాదం, స్తవం, భేరి మొదలైన అర్థాల్లో వాడటం లేదు. మొదలు అనే అర్థ మాత్రమే మిగిలింది - అర్థ సంకోచం వల్ల. (మూల: బూదరాజు రాధాకృష్ణ గారి వ్వాసం. మాటలు మార్పులు. 79)
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నాంది&oldid=874788" నుండి వెలికితీశారు