యాజ్ఞవల్క్యుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అష్టాదశ-స్మృతికర్తలు లలో ఒకడు. వారు: 1. వసిష్ఠుడు, 2. హారీతుడు, 3. వ్యాసుడు, 4. పరాశరుడు, 5. భరద్వాజుడు, 6. కాశ్యపుడు [వీరు సాత్వికులు], 7. చ్యవనుడు, 8. యాజ్ఞవల్క్యుడు, 9. అత్రి, 10. దక్షుడు, 11. కాత్యాయనుడు, 12. విష్ణువు [వీరు రాజసులు], 13. గౌతముడు, 14. బృహస్పతి, 15. సంవర్తుడు, 16. యముడు, 17. శంఖుడు, 18. ఉశనుడు [వీరు తామసులు].
  2. యజుర్వేద ధురంధరుఁడు అయిన వైశంపాయనుని శిష్యుఁడు. ఇతఁడు గురువునకు అపరాధము చేయఁగా ఆయన కుపితుఁడు అయి తనవలన గ్రహించిన వేదములను మరల తనకు ఇచ్చిపొమ్ము అనిన అతఁడు తాను చదివిన యజుర్గణమును తదుక్తక్రమమున క్రక్కెను. అంత అది నెత్తుటిచేత తడుపఁబడినది అయి ఎఱ్ఱనిరూపము తాల్చెను. అప్పుడు యజుర్గణాధిష్ఠిత శాఖాధిదేవతలు తిత్తిరిపక్షులు అయి దాని భుజియించిరి. అది మొదలు ఆశాఖలు తైత్తిరీయములు అయ్యెను. అనంతరము వేదవర్జితుఁడు అగు ఈ యాజ్ఞవల్క్యుఁడు అపరిమిత విచారమును పొంది ఉగ్రతపమున సూర్యుని సంతుష్టుని కావింపఁగా అతఁడు సంతసిల్లి హయరూపముతో సాక్షాత్కరించి యజుర్గణమును అతనికి ఉపదేశించెను. కావున అది వాజసనేయశాఖ అని చెప్పఁబడును. దానినే శుక్లయజుస్సు అనియు చెప్పుదురు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]