శుకుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

నామవాచకం

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. వ్యాసుని కుమారుడు.
  2. వ్యాసుని కొడుకు. వ్యాసుడు పుత్రార్థి అయి రుద్రునిఁగూర్చి తపము ఆచరించి జలపవనాంబరవసుధానల సమవీర్యుఁడు అగు ఒక సుతుని పొందునట్లు వరము పడిసి ఒకనాడు అగ్ని కార్యపరుడు అయి అరణి పుచ్చుకొని మథించుచు ఉండగా ఘృతాచి అను అప్సరస అతనికి లోచనగోచర అయి అతనిని కామగోచరునిగ చేసి తాను వంచనను చిలుక అయి ఉండెను. అంత వ్యాసుని యొక్క శుక్లము అరణి యందు పడి దానివలన ఇతడు పుట్టెను. శుకరూపిణివలన మోహితుఁడు అయి కన్న కొడుకు అగుటచే ఇతనికి వ్యాసుడు శుకుడు అని నామకరణము చేసెను. ఇతడు జన్మించిన మాత్రమున జ్ఞాని అయ్యెను. యోగి అయి మహాయోగ గమనము కైకొని సర్వాంతర్యామిత్వము వహించిన ఇతడు పోవు సమయమున వ్యాసుడు శుకశుక అని వెంటనంటి పిలుచుచు రాగా ఆధ్వని మృగపక్షిశైల సరిత్సరసీతరుగుల్మలతలు ఓయని ప్రత్యుత్తరములు ఇచ్చునట్లు ఆయెను. ఇతని కూతురు కీర్తిమతి.
  3. రావణుని చారులలో ఒకఁడు. వీడును సారణుడును రాముఁడు కపిసేనతో సముద్ర తీరమున విడిసి ఉండగా ఆసేనయందలి మర్మము లను తెలిసికొని రమ్మని రావణునిచే పంపబడినవారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=శుకుడు&oldid=961242" నుండి వెలికితీశారు