అగ్ని
Jump to navigation
Jump to search
యోగి వేమన
అగ్నిచేతబట్టి యా పరమేశుని
నిందచేసి నరులు నీరుకారె?
దక్షు క్రతవులోని తల్లడమెఱుగరా
విశ్వదాభిరామ వినురవేమ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- తత్సమం.
- అగ్ని నామవాచకం.
- వ్యుత్పత్తి
- వ్యు. అంగతి = గచ్ఛతి-అంగ + ని. (కృ.ప్ర.) పైకి వ్యాపించునది.
- సంస్కృతము अग्नि నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అష్టదిక్పాలకులలో ఒక్కఁడు. ఇతని దిక్కు పూర్వదక్షిణము. భార్య స్వాహాదేవి. పట్టణము తేజోవతి. వాహనము మేషము. ఆయుధము శక్తి. ఇతఁడు అష్టవసువులలో ఒక్కఁడయి వసువుల కందఱకును రాజై ఉండును. అనలుఁడు అనియు ఇతనికి నామము కలదు. కొందఱు అగ్నిని బ్రహ్మ జ్యేష్ఠపుత్రుఁడందురు. అతనినామము అభిమానాగ్ని. [కుమారస్వామి అగ్నిపుత్రుఁడని కొన్నిచోట్ల చెప్పఁబడి ఉన్నది.] చూ|| పార్వతి. కాశియందు విశ్వానరుఁడు అను ఋషికి ఇతఁడు కుమారుఁడై పుట్టినందున ఇతనికి వైశ్వానరుఁడు అను నామముకలదు. చూ|| అంగిరసుఁడు.
(త్రేతాగ్నులు = ఆహవనీయము, దక్షిణాగ్ని, గార్హపత్యము. ఇవిక్రమముగా వేదికి పూర్వ, దక్షిణ, పశ్చిమదిక్కులందు ఉండును.)
(పంచాగ్నులు = పైమూడగ్నులును, సభ్యము, అవసధ్యము. కడపటి రెండును వేదికి ఈశాన్యదిక్కునందు ఉండును.)
పదాలు[<small>మార్చు</small>]
నిప్పు, అగ్నిదేవుడు
- నానార్థాలు
- పర్యాయపదాలు
అగ్ని దేవుడికి
- హుతవహుడు.
- హుతాశనుడు.
- కృష్ణవర్త్ముడు
- దేవముఖుడు.
- సప్తజిహ్వుడు.
- వైశ్వానరుడు.
- జాతవేదుడు.
- వహ్ని.
- వీతిహోత్రుడు.
- కృపీటయోని.
- పావకుడు.
- అనలుడు.
- హుతభుక్కు.
- దహనుడు.
- శుచి.
- సప్తార్చి.
- దంటమోముల దేవర(ఇంకా ఉన్నాయి.)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అగ్ని లోఆజ్యం పోసినట్ట్లు
- మనిషి మనసు మేరు పర్వతం, హృదయము అగ్ని గోళం.. ఏక్షణాన ఈ అగ్ని గోళం భళ్ళున పగిలి వ్రక్కలవుతుందో ఆ క్షణాన తన శ్వాస అగి పొతుంది.