break
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, తెంపు, భంగము, బీటిక, గండి, సందు.
- Before the break of day తెల్లవారక మునుపు.
- at midnight there was a break of moonlight అర్ధరాత్రి లో కొంచెము వెన్నెల ల వచ్చినది.
- or stop, pause నిలుపు.
- for teaching a horse గుర్రాన్ని మరపడానకు కట్టేబండి.
- a break training cattle బారకాడి.
క్రియ, నామవాచకం, పగులుట, విరుగుట, తెగుట, చిట్లుట, చితుకుట.
- the cup broke in pieces ఆ గిన్నె తునకతునకలైనది.
- the stick broke to pieces ఆ కర్ర తునక తునకలైనది.
- after he had broken with them వాండ్లకున్ను వీడికిన్ని విరోధము వచ్చిన తరువాత.
- his health is breaking నానాటికి కృశిస్తున్నాడు.
- he is much broken శుష్కించినాడు, కృషించినాడు.
- I think his heart will break with grief వాడి మనసు వ్యాకులముతో కుంగిపోవును.
- When the clouds broke మేఘములు విచ్చిపొయ్యేటప్పటికి.
- the horse broke away from me నా చేతిలోనుంచి గుర్రము విడిబడి పారిపోయినది.
- when the boil brokeగెడ్డ పగిలి నప్పుడు.
- when the dawn broke తెల్లవారేటప్పటికి.
- before morning broke తెల్లవారక మునుపు.
- the table broke down మేజా విరిగినది.
- the branch broke down కొమ్మ విరిగినది.
- the horse broke down ఆ గుర్రముడీలుపడిపోయినది.
- he broke forth into song పాడసాగినాడు.
- he broke forthinto abuse తిట్టసాగినాడు.
- Sounds of music broke from the house ఆ యింట్లోనుంచి వాద్యఘోషము వింటున్నది.
- When the thieves break in or break through దొంగలు జొరబడేటప్పటికి.
- the horse broke loose ఆ గుర్రము తెంచుకొన్నది, వడబడ్డది.
- here the river breaks off యిక్కడ ఆ యేరు చీలుతుంది.
- they broke out of prison జెయిలులో నుంచి తప్పించుకొని పోయినారు.
- the blood broke out నెత్తురు వచ్చినది.
- I struck the tree the milk broke out ఆ చెట్టును కొట్టినాను పాలు వచ్చినది.
- a fire broke out in the market అంగడి వీధిలో నిప్పు బయలుదేరినది, అనగా అంగడి వీధి తగులుకొన్నది.
- Last year a war broke out పోయిన సంవత్సరము ఒక యుద్ధము ఆరంభమైనది.
- a quarrel broke out ఒక జగడము పుట్టినది.
- when the disease broke out in the town ఆ వూరిలో ఆ రోగము కనిపించినప్పుడు.
- the small pox broke out అమ్మవారు పోసినది.
- he broke out in a rage వాడికి ఆగ్రహము వచ్చినది.
- thieves have broken out in this neighbourhood యీ ప్రాంత్యములో దొంగలు బయలుదేరినారు.
- when the sun broke out మబ్బువిడిచియెండకాశేటప్పటికి.
- prickly heat broke out చెమరకాయలు లేచినవి.
- White-ants have broken out here చెదుళ్ళు బయలుదేరినవి.
- when the suns rays broke out through the darkness సూర్య కిరణములచేత చీకటి విచ్చేటప్పటికి.
- the school or assembly broke up పళ్ళికూటము, లేక, సభకలిసి పోయినది.
- when the village broke upon my view ఆ వూరు నాకు కండ్లపడేటప్పటికి.
క్రియ, విశేషణం, పగలకొట్టుట, విరగకొట్టుట, విరుచుట, తెంచుట.
- or to separate విభాగించుట.
- he broke the school into four classes ఆ పల్లె కూటపు పిల్ల కాయలను నాలుగు భాగములు చేసినాడు.
- the river broke its banks ఆ యేరుకట్టను తెంచుకొన్నది.
- he broke the cord ఆ దారమును తెంచినాడు.
- the blow broke his head ఆ దెబ్బకు వాడి తల పగిలినది.
- If you say that again I will break your head మళ్ళీ అంటివంటే తల పగలకొట్టుతాను.
- I never broke bread in his house నేను వాడిమట్లో వొకనాడున్ను భోజనము చేసినదిలేదు.
- he did this to break the charm or spell దీన్ని చేసి ఆ మంత్రకట్టును విడిచినాడు.
- there was a heap of grass underneath which broke his fall వాడు పడ్డందుకు కింద కసువువామివుండినందున దెబ్బ తిప్పినది.
- Fever broke his health జ్వరముచేత వాడి వొళ్ళు చెడిపోయినది.
- he is breaking his heart about her ఆమెను గురించి వ్యాకులముతో కుంగుతున్నాడు.
- the horse has broken his knees ఆ గుర్రముపది మోకాళ్ళు కొట్టుకొని పోయినవి.
- he broke his oath సత్యము తప్పినాడు.
- he broke the rule సూత్రభంగము చేసినాడు.
- I broke my shin నా కాలి గుర్రపు ముఖములో తగిలి గాయమైనది.
- when he broke silence మాట్లాడేటప్పటికి.
- he did not break silence వాడు నోరు తెరవలేదు.
- this fever broke his strength యీ జ్వరము వాడి బలమును కుంగ కొట్టినది.
- he was in doubt how to break the subject to her యీ సంగతిని ఆమెతో యెట్లా ప్రస్తాపము చేసేదని అనుమానిస్తూ వుండినాడు.
- he broke it to pieces దాన్ని బద్దలు చేసినాడు.
- to break wind పిత్తుట, తేణ్పువిడుచుట.
- he broke his vow ప్రతిజ్ఞ తప్పినాడు.
- he broke his word మాట తప్పినాడు.
- they broke the wall down గోడను యిడియ గొట్టినారు.
- to break in మరుపుట.
- he broke the horse in to the carriage ఆ గుర్రమును బండికి మరిపినాడు.
- the thieves broke into the house దొంగలు తలుపులు పగలకొట్టి, లేక, కన్నము వేసి యింట్లోకి దూరినారు.
- to break off వించుట, విరగగొట్టుట.
- he broke a branch off the tree ఆ చెట్టులో వొక కొమ్మ విరిచినాడు.
- he broke open the letter ల కోటా పగల కొట్టినాడు.
- he broke up the ground బీటిని తవ్వినాడు.
- he broke up the school by noon మధ్యాహ్నము పిల్లకాయలను విడిచి పెట్టినాడు, పళ్ళికూటము కలిసి పోయినది.
- he broke up his family సంసారాన్ని విచ్ఛిన్నము చేసినాడు.
- his death broke up the school అతను చచ్చినందున పల్లె కూటము ఛిన్నాభిన్నమై పోయినది.
- this will break you or cure you of telling stories యిందుచేత నీకు చాడి చెప్పే రోగము మానును.
క్రియ, విశేషణం, (add, to break ground i.e.to begin) ఆరంభము చేసుట, బైలుదేరుట.
- To break the ice అనగా To begin మొదలు పెట్టుట, ప్రస్తావము చేసుట.
- he broke ground in that business last year వాడు ఆ పనికి పోయిన సంవత్సరము ఆరంభించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).