lose
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, విశేషణం, ఓడుట, ఓడిపోవుట, పోగౌట్టుకొనుట, కోలుబోవుట.
- I have lost my knife కత్తి కానక పోయినది.
- I have lost the place అది తప్పినది.
- he lost the game ఆటలో వోడినాడు.
- he lost his bet పందెమును వోడినాడు.
- he has lost caste కులభ్రష్టుడైనాడు.
- he lost the day or battle అపజయమును పొందినాడు.
- he lost his eyes వాడికి కండ్లుపోయినవి.
- he lost his balance, and fell వొరిగినిలువలేక పడ్డాడు, సమాళించుకోలేక పడ్డాడు.
- he lost his appetite వాడికి ఆకలి అణిగిపోయినది.
- he lost all presence of mind గాబరా పడ్డాడు, భ్రమపడ్డాడు.
- In this business he lost himself very much ఈ పనిలో వాడి గౌరవము పోయినది.
- he lost his patience రేగినాడు.
- he lost himself in the wood అడివిలో తప్పిపోయినాడు.
- he lost himself in the wood అడవిలో తప్పిపోయినాడు.
- he lost heart వాడికి ధైర్యము తప్పినది.
- you have no time to lose కాలహరణము చేయవద్దు, ఆలస్యము
చేయక.
- you must lose no time in going there తక్షణము పోవలసినది.
- he has lost his senses వాడికి స్మారకము తప్పివున్నది.
- she lost colour దాని వర్చస్సు పోయినది.
- he has lost his health వాడికి వొళ్ళు కుదురులేదు.
- It has lost it's scent దాని వాసన పోయినది.
- I lost sight of itఅది నాకు అగుపడలేదు.
- you must not lose sight of this నీవు దానిమీద దృష్టి వుండవలసినది.
- you must not lose sight of him నీవు వాణ్ని వుపేక్ష చేయవద్దు.
- this knife has lost it's edge ఈ కత్తిపదును పోయినది.
- It lost it's colour దాని రంగు మాశినది.
- the river here loses itself in the sand ఆ యేరు యీ యిసుకలోఅంతర్వాహినియై పోయినది.
- the hill loses itself in the clouds ఆ పర్వతము మేఘములోమరిగిపోయినది.
- all traces of it are lost దాని పొలుకువ లేకపోయినది.
- the opportunity was lost సమయము తప్పినది.
- a passage lost in a poem గ్రంథపాతము.
- I was lost in astonishment నాకు అత్యాశ్చర్యమైనది.
- he is lost to all shame వాడికిలజ్జేలేదు.
- he was lost in thought తదేక ధ్యానముగా వుండినాడు.
నామవాచకము, Loser, s, ఓడినవాడు, పోగొట్టుకొన్నవాడు, కోలుపడ్డవాడు.
- they came off losers ఓడినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).