sort
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, kind quality విధము, జాతి, దినుసు.
- all these are of the same sort ఇవి అంతా వొక మచ్చే, అంతా వొక విధమే.
- what sort of wood is this? ఇది ఏ జాతి కొయ్య.
- what sort of a house is this? యిది యే విధమైన యిల్లు.
- in some sort this is a compensation దీన్ని వొక బహుమానముగా పెట్టుకోవచ్చును,అనుకోవచ్చును.
- a sort of dress merely means a dress వొక విధమైన వుడుపు అంటేవూరికే వుడుపు అనే అర్థమే అవుతున్నది.
- you have brought the wrong sort of seed కావేలసినదాన్ని విడిచిపెట్టి వేరే మరి వొక విధమైన విత్తులను తీసుకొని వచ్చినావు.
- this is the right sort of cloth కావలసిన గుడ్డ యిదే.
- of what sort? యెటువంటి.
- of this sort యిటువంటి.
- of that sort అటువంటి.
- they make a curious sort of cloth here యిక్కడ వొకవిధమైన వింత గుడ్డలు నేస్తారు.
- there were fruits of six sorts ఆరు విధములైన పండ్లు వుండినవి.
- flowers of all sorts నానా విధములైనపుష్పములు.
- he rides out in all sorts of weather యీ కాలము ఆ కాలము అనిచూడకుండావాడు అన్నిడకాలములలోనున్ను గుర్రమెక్కి పోతాడు.
- people of a better sort గొప్పవాండ్లు, ఘనులు.
- people of the baser sort నీచులు, తుచ్చులు.
- people of the middlesort సామాన్యులు.
- he is out of sorts to-day యీ వేళ వాడికి వొళ్ళు యిదిగావున్నది.
క్రియ, విశేషణం, తరగతులుగా యేర్పడుట, క్రమముగా యేర్పరచుట, విభజించుట.
- he sorted the cloth ఆయా మచ్చుగడ్డలను వేరేవేరే పెట్టినాడు.
- they sorted the goods ఆయా సరుకులనుయేర్పరచి వేరేవేరేగా పెట్టినారు.
- this was an ill sorted marriage ఇది వికారమైన పెండ్లి, అనగా యీ ఆలు మొగుడికి సయోధ్యగా వుండలేదు.
క్రియ, నామవాచకం, to agree తగివుండుట, సరిపడి వుండుట, యిమిడికగా వుండుట.
- this pride does not sort with his condition వాడు వుండే గతికి యీ గర్వము బాగా వుండలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).