wild
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, not tame, savage, licentious అడవిదైన, వన్యమైన,సాకవడి, దుష్ట.
- a wild cat అడవిపిల్లి.
- wild beasts దుష్టమృగములు.
- they cried in the wildest manner వెర్రిగా అరిచినారు.
- wild land అడవిపట్టుగా వుండే భూమి, బీడుగా పడి వుండే భూమి.
- the wild vine అడవిద్రాక్ష, పడి మొలిచిన ద్రాక్ష.
- wild people, or savages అడవి మనుష్యులు, చెంచువాండ్లు.
- a wild plant అడవి చెట్టు.
- wild corn అడవిధాన్యము.
- wild herbs వన్యోషధులు, అడివిలో వుండే ఆకుఅలము.
- a wild cat అడివిపిల్లి.
- a wild duck అడవిబాతు.
- a wild buffalo అడవిదున్న, కారుబోతు.
- an animal sometimes called a wild cow అడవి ఆవు.
- wild a cattle అడవి పశువులు.
- wild boar అడవి పంది.
- she talked like a wild woman అది పిచ్చి యెత్తుకొన్న దానివలె మాట్లాడినది.
- a wild sheep కొండగొర్రె.
- the wild rose నక్కపన్నీరు.
- he is wild about the business వాడికి ఆ పనిమీద పిచ్చి పట్టుకొన్నది.
- wild sports వేట.
- the wild cucumber నక్కదోడకాయ.
- wild honey అడవితేనె, కొండతేనె.
- wild fire దావాగ్ని, కార్చిచ్చు.
- the report spread like wildfire సమాచారము అడవి చిచ్చువలె అంటుకొన్నది.
- the goods went off like wildfire ఆ సరుకులు నిమిషములో అమ్మకమైపోయినవి.
- wild justice బలాత్కారముగా చేసిన శాస్తి, సాహసము చేసి చేశిన శిక్ష.
- he has sowed his wild ocats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, మునుసటి ఔద్ధత్యము అణిగి శాంతుడుగా వున్నాడు.
నామవాచకం, s, a desert, a waste, uncultivated region అడవి, అరణ్యము వనాంతరము, ఎడారి, దిక్కిమాలి బైలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).