అగస్త్యుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అగస్త్యుడు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అగస్త్యమహర్షి.
- ఒక నక్షత్రం.(Canopus)
- ఇతడు సప్తఋషులలో ఒకడు. ఆ సప్త ఋషులు:: 1. భృగుడు. 2. అంగీరసుడు. 3. కశ్యపుడు. 4. అత్రి. 5. వశిష్టుడు. 6. అగస్త్యుడు. 7. విశ్వామిత్రుడు.
- ఒక వేదకాలపు ఋషి. మిత్రావరుణులు వేదకాలపు జంటదేవతలు. ఒకసారి వీరిరువురు ఊర్వశిని చూసి మోహపరవశులై వీర్యస్ఖలనం చేసుకున్నారు. ఆ వీర్యాన్ని ఒక కుండలో ఉంచి రక్షించగా దాని నుంచి ఇద్దరు శిశువులు జన్మించారు. ఒకరు అగస్త్యుడు. రెండవవారు వశిష్టుడు.
ఇతఁడొక మహర్షి. మిత్రావరుణులు సముద్రపుగట్టున సంచరించుచుండి ఊర్వశిని చూచి కామింపవారికి వీర్యములు స్ఖలితములై ఘటమున ఉనుపఁబడఁగా అందు అగస్త్యవసిష్ఠులు పుట్టిరి. ఇతని యాశ్రమము వింధ్యపర్వతసమీపమున.
ఈతని కథలనేకములు కలవు. వాతాపి ఇల్వలుడు అను నిరువురు రాక్షసులు బ్రాహ్మణులను మిగుల హింసించుచుందురు. రాక్షసులు కామరూపులు గనుక ఇల్వలుఁడు సాధారణముగ ఒక బ్రాహ్మణరూపము ధరియించి వాతాపిని మాంసముగ వండి తన యింట పితృకార్యమనుచు బ్రాహ్మణుని ఎవ్వనినైనను పిలిచి భోజనము పెట్టి భోజనానంతరము బ్రాహ్మణభుక్తశేషమును భుజియించుటకు రమ్మనువానివలెనే వాతాపిని పిలుచును.వాఁడు అపుడ ఆబ్రాహ్మణుని పొట్ట చించుకొని వెలుపలికి వచ్చును. ఈ సంగతిని అగస్త్యమహర్షి యెఱిఁగి ఒక దినము ఇల్వలుని యింటికి బ్రాహ్మణార్థము వచ్చెను. అప్పుడు ఎప్పటి తెఱంగున ఇల్వలుఁడు చేయఁగా అగస్త్యుఁడు "వాతాపే జీర్ణో భవ" అనెను. అంత వాతాపి నశించెను. ఇల్వలుఁడు అగస్త్యుని పై పడిరాఁగా అతనికోపముచే భస్మమాయెను.
మఱియు తొల్లి ఒకప్పుడు మేరువింధ్య పర్వతములకు ఒక నిమిత్తము వివాదము కలిగి వింధ్యపర్వతము సూర్యచంద్రగతులకు అడ్డముగ పొడవెదుగ లోకమునకు అలజడి పొడమ అది తెలిసి దేవర్షులు అగస్త్యునిచెంతకు పోయి పొడమిన విపత్తును విచారింపుడని వేఁడఁగా అమ్మహామహుఁడు బయలువెడలి తన శిష్యుఁడగు వింధ్యముకడకు రాఁగా ఆపర్వతశ్రేష్ఠుడు అగస్త్యునకు దండప్రణామము ఒనర్చుటకు నేలమట్టమయ్యెను. అప్పుడు అగస్త్యుడు వింధ్యునిం గని నేను దక్షిణమునకు పోయి మరలి వచ్చుదనుక నీవిచ్చట ఈప్రకారమే ఉండుమని పలికి పోయెను. వింధ్యము అది మొదలు ఇదివఱకును ఆ ప్రకారముననే క్రింద పడి ఉన్నదని ప్రసిద్ధి. వెండియు ఇతడు కాలకేయులనిమిత్తము సముద్రమునందలి జలమును ఆపోశనముగ తీసికొనెనని పురాణకథ. చూ|| కాలకేయులు. మఱియు నహుషుఁడు దేవేంద్రత్వమును అనుభవించుచుండినపుడు ఒకనాడు వేదములంగూర్చియు బ్రాహ్మణులంగూర్చియు నిర్లక్ష్యముగ మాటలాడినందున వానిని సర్పమగునట్లు అగస్త్యుఁడు శపియించెనని చెప్పియున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |