అలక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
విశేషణము
వ్యుత్పత్తి
బహువచనం
అలుకలు

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  • ఒక నిశ్చితమైన ఫలితాన్ని కోరి, ఓ పథకం ప్రకారం ఆ పని ని సాధించేందుకు కోపం వహించడం. ఈ కోపం తెచ్చుకున్నదే అయి ఉంటుంది. ఆవేశంతో కూడిన కోపం కాదు. చిన్నపిల్లలు తామనుకున్నది సాధించేందుకు,పెద్దవాళ్ళను ఒప్పించేందుకు అలుగుతారు.
ఇతర రూపాలు
అలుక

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
కినుక
సంబంధిత పదాలు

కోపము, అలుగుట అలక వహించుట

వ్యతిరేక పదాలు
ప్రసన్నము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "అలుక మానవే చిలుకల కొలికిరో, తలుపు తీయవే ప్రాణసఖీ!" శ్రీకృష్ణుని భార్య యైన సత్యభామ అలుకలకు ప్రసిద్ధి. ఆమే అలుక తీర్చేందుకు ఒక సినిమాలో కృష్ణుడు పాడిన పాట పల్లవి ఇది.
  • అలుక వహించి, అలుక తీర్పవచ్చిన భర్త దశరథుని చేత శ్రీరామవనవాసానికి ఒప్పించిన ప్రసిద్ధ కైకేయి అలుక సన్నివేశం శ్రీమద్రామాయణం లోనిది.
  • కోపాన్ని కూడా అలుకగానే పద్య సాహిత్యంలో వర్ణించారు. "అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ము డజాతశత్రుడే యలిగిననాడు.." అంటూ పాండవోద్యోగ విజయాలు లో తిరుపతి వేంకట కవులు రాసారు. ధర్మరాజు కు కోపం వస్తే ఏం జరుగుతుందో వర్ణించిన సందర్భం అది.
  • అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
  • అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే(పద్యంలోని ఒక పాదం)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అలక&oldid=951191" నుండి వెలికితీశారు