ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
స్వరూపం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
"ఉట్టి" - అంటే త్రాళ్ళతో అల్లిన ఒక సాధనం. కప్పునుండి వ్రేలాడుతుంది. పల్లెలలో (ఇదివరకు) పాలు, పెరుగు వంటివాటిని పైకప్పునుండి ఉట్టిలో వ్రేలాడదీసే వారు, పిల్లులవంటివాటినుండి రక్షణగా. (ఇప్పుడు చిన్నికృష్ణుని కేలెండర్లలో ఎక్కువగా చూస్తుంటాము.)
ఏదైనా ఒక పని చెయ్యాలంటే ప్రతీ మనిషికి ఎంతో కొంత సామర్ధ్యం వుండాలి. ప్రతిపనీ చేసేస్తానని గొప్పలు పోతే అందరిలోను నవ్వులపాలు కాక తప్పదు. అలాంటి సందర్భంలో వచ్చే సామెతే ఇది.ఇంట్లో చూరికి వున్న ఉట్టి ఎగిరి అందుకోలేని ఆవిడ ఆకాశం లోని స్వర్గాన్ని అందుకోలేదుకదా. అలాగే చిన్న పని చెయ్యలేని వారు వారి సామర్ధ్యానికి మించిన పని చేస్తానంటే వారిని వేళాకోళం చేస్తూ అనే మాట ఇది.
- రూపాంతరాలు
- ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు