Jump to content

మడుగు

విక్షనరీ నుండి

మడుగు

మడుగు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం మడుగులు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. కొలను\చెరువు
  2. మడత కు క్రియా రూపము:
  3. బరువు కొలమానము: (మణువు)/[మణుగు] ఉదా: దాని బరువు ఎన్ని మడుగులు?

కోనేరు

  1. మడత పెట్టిన వస్త్రము =
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక పద్యంలో పద ప్రయోగము: గడనగల మగని జూచిన అడుగడుగున మడుగు లిడుదురతివలు తమలో, గడనుడిగిన మగని జూసిన నడుపీనుగ వచ్చు నంచు నగుదురు సుమతీ
వివరణ = గత కాలములో రాజులు, ఇతర ప్రముఖులు సభామందిరమునకు వచ్చేటప్పుడు చాకలివారు ముందుగా చీరలను పరుస్తుంటే వాటిమీద రాజు గారు నడుస్తుండే వాడు. ఈ సాంప్రదాయము ఇప్పటికి కొన్ని కులాలలో కొన్ని సంధర్బాలలో(ఉత్సవాలలో) జరుగు తున్నది. ప్రముఖుల కాళ్ళు కంది పోకుండా ఇలా వస్త్రం పై నడుస్తుంటారు. దానినే అడుగులకు మడుగు లిడుట అని అంటారు. ఇలా అడుగులకు మడుగులిడిచేవారు చాకలి వారు. అందుకే చాకలి ని మడేలు అని అంటారు. లవకుశ సినిమా లోని ఒక పాటలో పద ప్రయోగము చూడండి. చదివినోడికన్నా ఓరన్నా మడేలన్న మిన్నా ...
  1. అక్కడ నెత్తురు మడుగు కట్టియుండినది
  • కడలిఱేని బిడార మడుగుముట్టఁ గలంచి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మడుగు&oldid=958461" నుండి వెలికితీశారు