విక్షనరీ:మూలస్వరూపం
విక్షనరీ మూలస్వరూపం (పద చట్రం) పై చర్చజరిపి ఏకాభిప్రాయం రావటానికి పేజీ. మొదలు ఇతర వికీపీడియాలలో రూపాన్ని పరిశీలిద్దాం.
ఇంగ్లీషు పదరూపం
[<small>మార్చు</small>]ఇంగ్లీషు విక్షనరీ భాష->వ్యుత్పత్తి->భాషావిభాగం->అర్థం(కావలసినప్పుడు కనబడేటట్లుపదప్రయోగాలు) , పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు, అనువాదాలు, ఈ పదమూలంతో పుట్టిన పదాలు వాడుతున్నారు. ఉదా:[1]
- లాభాలు
- బహుభాషా నిఘంటువు ప్రత్యేకించి లాటిన్ భాషలకి ఒక నిఘంటువుగా రూపొందటానికి వీలు.
- చిన్న పదానికి అర్థం కావాలంటే పొడుగు పేజీ చదవాల్సి వస్తుంది.వాడుకోగల సౌకర్యం తక్కువ.
- పద ప్రయోగాలు కావాలిస్తే కనబడేటట్లు చేశారు.
- నష్టాలు
ఇతర భాషలకు ప్రత్యేక నిఘంటువు ఆవశ్యకత తొలగించలేదు.
కన్నడ పదరూపం
[<small>మార్చు</small>]నామవాచకం శీర్షికగా, ఒకటే వరుసలో అర్థాలు రాస్తున్నారు. తరువాత అనువాదం శీర్షికతో ఇంగ్లీషు పదం రాస్తున్నారు. ఉదా:[2]
- లాభాలు
సులభమైన రూపం. పదానికి తప్పకవుండే అంశాలు మాత్రమే వున్నాయి. అందుకనే 2 లక్షలపైగా పదాలు చేర్చారు.
- నష్టాలు
వ్యతిరేఖపదాలు, పద ప్రయోగాలు లేవు
తమిళ పదరూపం
[<small>మార్చు</small>]- లాభాలు
- నష్టాలు
తెలుగు రూప ప్రతిపాదనలు
[<small>మార్చు</small>]మన చట్రం లో అర్థవివరణ, నానార్థాలు, పర్యాయపదాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు, పదప్రయోగాలు, అనువాదాలు వున్నాయి. అర్థవివరణ కు నానార్థాలకు, పర్యాయపదాలకు తేడా స్పష్టంగాలేదు. (ఉదా:అమ్మచూడండి.) చాలా పదాలకు సరైన వివరాలు లేక శీర్షిక మాత్రమే కనిపిస్తున్నాయి. అనువాదంలో మన భారతీయ భాషలు చేర్చిన వాటిని పూర్తి చేసే అవకాశం బహుతక్కువ. ఇది విక్షనరీ నాణ్యతను దెబ్బతీయకలదు. అందుకని సులభంగా వుండేటందులకు క్రింద ప్రతిపాదనలు చూడండి. వీటన్నిటికి అవసరమైనప్పుడు బొమ్మ, ధ్వనిదస్త్రం , వికీపీడియా లింకు మొదటగా వుంచవచ్చు.
రూపం1
[<small>మార్చు</small>]- ఈ రూపం లక్షణాలు
- విభాగాలను కుదించటం
- భాషా విభాగాలను ఒక లైనుకే పరిమితం
- భాషా విభాగం-> అర్థం ->పర్యాయపదాలు->వ్యతిరేఖపదాలు->వుత్పత్తిపదాలు->మూలాలు, వనరులు
- వ్యుత్పత్తిపదాలకు మాత్రమే మరల పేజీలు చేయటం
- ఏ విభాగానికైనా సమాచారం లేకపోతే ఆ విభాగం శీర్షిక కనబడదు
ఉదాహరణ:Wiktionary:మూలస్వరూపం/ రూపం1/అమ్మ
- లాభాలు
- ప్రస్తుత ( ఏప్రిల్ 2012) కూర్పుకన్న మెరుగు
- పర్యాయపదాలు, వ్యతిరేఖపదాలు, వుత్పత్తిపదాలు వుండటం వలన పదానికి సంబంధించిన మరింత వివరము వుంది
- నష్టాలు
- క్లిష్టత ఇంకావుంది.
రూపం 2
[<small>మార్చు</small>]ఇంగ్లీషు థెసారస్ రూపాలను పరిశీలించినతరువాత, అవి భావాన్ని వ్యక్తపరచడానికి వుద్దేశించినవి. వాటి స్వరూపం మామూలు విక్షనరీకి భిన్నంగా వుంది. అందుకని రూపం 1 క్లిష్టతను తగ్గించటానికి ప్రతిపాదన చేస్తున్నాను.
- ఈ రూపం లక్షణాలు
- విభాగాలను కుదించటం
- భాషా విభాగాలను ఒక లైనుకే పరిమితం, ఇంగ్లీషు పదాలకు ప్రత్యేక శీర్షిక లేదు
- భాషా విభాగం-> అర్థం,పర్యాయపదాలు->సంబంధిత పదాలు-> పదప్రయోగాలు->మూలాలు
- ఏ విభాగానికైనా సమాచారం లేకపోతే ఆ విభాగం శీర్షిక కనబడదు
ఉదాహరణ:Wiktionary:మూలస్వరూపం/ రూపం2/అమ్మ
- లాభాలు
- రూపం 1 కూర్పుకన్న మెరుగు. ఇంగ్లీషు పదాల తెలుగు పదాలతో పాటు వస్తాయి.
- నష్టాలు
- ఇంగ్లీషు పదాలకు పత్యేక శీర్షిక లేదు.
ఇవీ చూడండి
[<small>మార్చు</small>]- Wiktionary:రచ్చబండ లో పాత చర్చ