విక్షనరీ చర్చ:మూలస్వరూపం
విషయాన్ని చేర్చుస్పందన
[<small>మార్చు</small>]నేను గత నెలరోజులుగా విక్షనరీలో పనిచేస్తున్నాను. ఆంగ్లంలో మీరు తెలియజేసిన కన్నడం మాదిరిగా చాలా సరళంగా ఉన్నది. నాలుగు విభాగాలు మాత్రమే ఉంటాయి. విస్తరిస్తున్న కొద్దీ కొత్త విభాగాలు చేరతాయి. ఏమీ సమాచారం లేని ఖాళీ విభాగాలు కన్నా అవి లేకుంటేనే బాగుంటుంది. ఇక ఇతర భాషా అనువాదాలు దాచి వుంచితేనే బాగుంటుంది. ఇక వికీపీడియాలోని అన్ని భాషల లింకులు అస్సలు అవసరం లేదు. కొత్త పదాన్ని తయారుచేయు అని అడిగినప్పుడే అది నామవాచకమా, విశేషణమా, క్రియ అనే కొద్ది విభాగాలుగా చేసి ఒక్కొక్కదానికి వేరువేరు మూసలు తయారుచేసి పెట్టుకొని అదే మూసలో కొత్తపదం చేరేటట్లు చేస్తే బాగుంటుంది. కొన్ని కీలకమైన పదాలకు బొమ్మలు చేరిస్తే బాగుంటుంది. బహువచనం పదాలకు ఆంగ్ల వికీలో మాదిరిగా చిన్నముసను ఉపయోగించి ఏకవచన పదాన్ని (దారిమార్పు కాదు) తెలియజేయడం బాగున్నది. పేజీల సంఖ్యతో బాటు ఒక రకంగా తికమక ఉండదు. అలాగే చిన్నమార్పుతో ఉండే ఒకే పదాలకు వేరు వేరు పేజీలు ఉన్నాయి. వాటికి కూడా ఆంగ్లంలో ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ అనే మరో చిన్న ముస ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు అందం మరియు అందము రెండు వేర్వేరు పేజీలు కాకుండా మన పాలసీల ప్రకారం ఒక పేజీలో వివరాలు చేర్చి రెండవ పేజీలో చిన్న మూస పెడితే బాగున్నది. ఖాళీ ఉండే విభాగాలను ఎప్పటికప్పుడు తొలగించే బాటు ఎవరైనా కార్యాచరణలో పెడితే చాలా సర్వర్ స్పేస్ మిగులుతుంది. ఆంగ్లంలో 100 కె.బి. ఉన్న పదం ఏమీ సమాచారం లేకుండా 200 పైగా స్పేస్ తినేస్తున్నది. ఇవన్నీ ఆలోచించి నిర్వాహకులు సరైన మూసల్ని పెట్టి రచయితలకు ప్రోత్సహించండి.Rajasekhar1961 (చర్చ) 13:56, 7 మే 2012 (UTC)
- మీ స్పందన పూర్తిగా అర్థంకాలేదు. రూపం 1 ప్రకారం కొత్త విభాగాలు చేర్చటానికి అవకాశం లేదు. దానిలో వున్న విభాగాలకి సమాచారం లేకపోతే ఆ విభాగాలు కూడా కనబడవు, దీనితో మీరు ఏకీభవిస్తున్నారా లేదా ఇంకేదైనా మార్పులు ప్రతిపాదిస్తున్నారా తెలియచేయండి. (ఇక మీ మిగతా సలహాలపై నా అభిప్రాయం: సాధారణంగా పేరు మార్పులకు( సున్నకు బదులుగా ము వాడటానికి) మనం సున్న వాడితే సరిపోతుంది. పదాలకోసం వెతికేటప్పుడు టైపుచేసేటప్పుడే సున్న పదం కనబడుతుంది. లేక శోధనాయంత్రం దగ్గరి పదాలను చూపెడుతుంది. మనం వ్యాకరణ బద్దంగా తయారయ్యే బహువచనాల పదాలు రాసుకుంటా పోతే, విక్షనరీ వాడే అశేషజనానికి అనవసరపు సమాచారంగా పరిగణించగలరు).--అర్జున (చర్చ) 03:50, 8 మే 2012 (UTC)
- మీకు అర్ధం అయ్యేటట్లుగా తెలియజేయలేకపోతున్నాను. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 05:18, 8 మే 2012 (UTC)
- రాజశేఖర్ గారు, మీ ప్రత్యుత్తరము నాకు ఆశ్చర్యం కలిగించింది. నేనడిగిన ప్రశ్నకు సమాధానమివ్వటంలో కష్టమేమున్నది. నేను రాసినది మీకు అర్థంకావటంలేదా? --అర్జున (చర్చ) 06:26, 8 మే 2012 (UTC)
- మీకు అర్ధం అయ్యేటట్లుగా తెలియజేయలేకపోతున్నాను. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 05:18, 8 మే 2012 (UTC)
- మీ సలహాను పాటిస్తాను. అలాగే చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 08:11, 8 మే 2012 (UTC)
- ధన్యవాదాలు. మీకు రూపం1 సమ్మతమని భావిస్తాను. ఇతర వికీమీడియన్ల స్పందనలకు ఒక వారం వేచిచూసి ఆ తరువాత పనులు చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 09:07, 8 మే 2012 (UTC)