pain
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నొప్పి, తీపు, బాధ, సంకటము,వేదన, వ్యాకులము, వ్యసనము.
- he put me to pain about this యిందున గురించి నన్ను నొప్పించినాడు, నన్ను వ్యధ పెట్టినాడు.
- he shall not do this on pain of being dismissed వాడు అట్లా చేస్తే వాడికి వుద్యోగము పోను.
- avoid this conduct on pain of my displeasureయీ పని చేయరాదు చేస్తే నాకు కోపము వచ్చును.
- pains and penalties ఫలాని తప్పు కు ఫలాని శిక్ష అనే చట్టము.
- he took great pain s to please themవాండ్లను సంతోషపెట్టడానకై బహు ప్రయాసపడ్డాడు.
- how can you succeed if you do not take pain s శ్రమ పడకుంటే నీకు యెట్లా కూడివచ్చును.
- he had his labour for his pains వాడికి ప్రయాసే మిగిలినది, వాడికి కష్టమే దక్కినది.
- he is a fool for his pain s వాడు పడ్డ ప్రయాసకు వెర్రివాడనిపించుకొన్నదే లాభము.
- he had his journey for his pains కాళ్ల శనిపట్టి పోయినాడు.
- he is a pain s taking man శ్రద్దగా పాటు పడేవాడు.
క్రియ, విశేషణం, నొప్పించుట, వేధించుట, బాధించుట, పీడించుట, ఆయాసపెట్టుట.
- the wound pain s me ఆ పుండు నొత్తున్నది it pain ed me to see this దీన్నిచూడడానికి నాకు వ్యాకులమైనది his language pained them వాడు చెప్పినదానికివ్యసనపడ్తారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).