press
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, అణచుట, అదుముట.
- or to squeeze పిండుట, పిడుచుట, వొత్తుట.
- press the clothes down ఆ బట్టలను కిందికి అణచు అదుము.
- he pressed the point of his sword against my breast కత్తి మొన ను నా రొమ్ము మీద పెట్టి అణచినాడు.
- to press seed for oil గానుగ ఆడుట.
- or to distressబాధించుట, వేధించుట, పీడించుట, తొందరబెట్టుట.
- he pressed his house upon me or he pressed me to take his house వాడి యింటిని నాకు బలవంతము గా తగల గట్టినాడు.
- being pressedby poverty he sold the house దరిద్రము యొక్క తొందర చేత ఆ యింటిని అమ్మినాడు.
- when they are much pressed వాండ్లకు సంకటము వచ్చినప్పుడు.
- to press for paymentతరువుచేసుట.
- to press soldiers or sailors బలాత్కారము గా కొలువు లో పెట్టుకొనుట.
- he press ed them as workmen into the business యీ పనికి వాండ్లను వెట్టికి పట్టినాడు.
- I pressed this point very much యిందున గురించి నేను నిండా బలవంతము చేస్తిని.
క్రియ, నామవాచకం, ఆతురపడుట, తొందరపడుట.
- the time presses సావకాశములేదు.
- In battle they pressed upon us యుద్ధములో వాండ్లు మా పైన వచ్చిపడిరి.
- the stone pressed on his breast ఆ రాయి వాడి రొమ్మును అణచివేసినది.
- they press ed into the room ఆ యింట్లోకి జొరబడ్డారు, బలవంతముగా తోసుకొనిఆ యింట్లోకి జొరబడ్డారు.
- the students press forward for distinction విద్యార్థులు నేను ముందు నేను ముందు అని పైబడుతారు.
నామవాచకం, s, Multitude గుంపు, సందడి, సమ్మర్ధము.
- from the press of businessబహుపనివల్ల.
- printing press అచ్చు, అచ్చుయంత్రము.
- errors of the press అచ్చుకూర్చడములో వచ్చే తప్పులు.
- the work was put ot press ఆ గ్రంథము అచ్చువేయడానకు ఆరంభమైనది.
- they stopped the press అచ్చు వేయడమును చాలించినారు.
- the daily press i.e. newspapers సమాచార పత్రికలు the daily press confirms thisసమాచార పత్రికలవల్ల యిది రూఢమైనది.
- or cabinet అల్మారా.
- a press bed అల్మారా వలెవుండే వొక విధమైన మంచము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).