Jump to content

అందు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • సప్తమీవిభక్తి ప్రత్యయము
  • దేశ్యము

అందు అవ్యయము/సకర్మకక్రియ/అకర్మకక్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • (అవ్యయము)ఆ చోట, వాని లో, వారి లో, దాని లో. సప్తమీవిభక్తి ప్రత్యయము./ అక్కడ
  • (సకర్మకక్రియ)పొందు,అందుకొను, చేరు, తాకు, పుచ్చుకొను, పట్టుకొను.
  • (అకర్మకక్రియ)దొరకు, చిక్కు.
  • అక్కడ
  • సప్తమీవిభక్తి ప్రత్యయము. (అందు, ఇందు, న.);
  • (లింగవచనభేదము లేకుండఁగ) దానియందు, వానియందు, వారియందు, దానిలో, వానిలో, వారిలో.
నానార్థాలు

1వ అర్ధము:

2వ అర్ధము:

  • అందుకొను

3వ అర్ధము:

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

ఇందు అనగా ఇక్కడ అని అర్థము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. చదువులందు రాజపదవులందును పాడి; మొదవులందు స్త్రీల పెదవులందు; నాశ లుడుగునట్టి యయ్యలు ముక్తులు - వేమన పద్యము.
  2. ఒక పద్యంలో పద ప్రయోగము: అందు గలడిందు లేడని సందేహము వలదు.....
  3. ఒక పాటలో పద ప్రయోగము: అందాల ఓ చిలుకా....... అందుకో నాలేఖ..... నాకనులతో వ్రాశాను......
  4. పొందు. - "గీ. నీవును, నేనుఁజని విదర్భనిష్టలీల, నుండుదము మృగాకులోగ్రవనంబుల, కరుగనేల యిడుమ లందనేల." భార. ఆర. ౨, ఆ.
  5. ఒక పద్యంలో పద ప్రయోగము: ఇందుగలడందు లేడని సందేహమువలదు
  6. నీయందు నమ్మికయుంచుము
  7. వారు అందిన కాడికి దోచుకున్నారు
  8. అది అటక మీదున్నది నాకు అందదు
  9. చేరు. - "తే. డెందమును వాక్కు నెవ్వాని నందలేవు, కాంతు రెవ్వాని దహరపుష్కరము నందుఁ, బరమయోగీంద్రు లధికతాత్పర్యలీల, నట్టి నీకు నమస్కార మఖిలవంద్య." కాశీ.౨,ఆ. ౪;
  10. "తే. అనఘు, లార మోక్ష మీపరిపాటి గారవమున, నాదరించు జనంబుల కందు ముక్తి." భార.శాం.౫,ఆ. ౫౪౯;
  11. పోతన పద్యంలో పద ప్రయోగము: అందుగల డిందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుం, డెందెదు వెదికి చూసిన అందు కలడు దానవాఘ్రణి వింటే....

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
  • సూ.ని

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అందు&oldid=950345" నుండి వెలికితీశారు