అట్టు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
- అట్లు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బియ్యము, మినపప్పు నానబెట్టి రుబ్బి పిండిని పులవబెట్టి మరుసటి రోజు పెనం మీద పలచని పొరగా పోసి కాల్చి చేస్తారు. దీనిని చాలా రాష్ట్రాలలో దోశ అంటారు. తెలుగు వాళ్ళు అట్టు అనికూడా అంటారు. ఇంకా వీటిని రకరకా పద్దతులతో చేస్తారు. ఎండిన పిండితో వివిధ రకాలుగా కలుపుతూ పులవకుండా అప్పటికపుడు తయారు చేస్తూ ఉంటారు. ఇది భారతీయుల ప్రీతికరమైన ఉదయపు అల్పాహారము (టిఫిన్). 1. బియ్యము మున్నగువాని పిండితో దోసెగా పోసినది. [తెలంగాణము; సర్కారు] పెసరట్టు; -అట్లతదియ గౌరమ్మ పండుగ. 2. హరము అను అర్థమునందును వాడుక కలదు. [తెలంగాణము; వరంగల్లు] (రూ) హట్టు. అతడు చాల అట్టుమనిషి. 3. కోడిగుడ్డుతో దోసెగా పోసినది; ఆంలెట్. [నెల్లూరు] 4. తెంపులేకుండ ఒకటిగా ఏర్పడినది. [వరంగల్లు] అట్టుకట్టుకొనిపోయినది; -అట్టుతింటె జుట్టు పెరుగుతది. సామెత.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అట్టు దక్షిణ భారతీయులకు ప్రియమైన ఫలహారం.
- ఒక పాటలో పద ప్రయోగము: అట్టు రా పెసరట్టురా దీన్నొదిలిపెట్టే దెట్టరా.....
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]