ఆనవాలు

విక్షనరీ నుండి

ఆనవాలు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము/దే. వి.

వ్యుత్పత్తి

ఆన+పాలు

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఇగురు కాచిన పాలు అని ఆర్థము
  2. గుర్తించుట రూ. ఆనాలు.
  3. అడియాలము;
  4. గుఱుతు.. ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

గుర్తు

పర్యాయ పదములు

అడపొడ, ఆనవాలు, ఈగడ, ఉనికి, ఐపు, కందువ, చాయ, చూచాయ, జాడ, తాపి, త్రోవ, పారువ, పొడ, పొలకువ, పొలుపు, పొలము, పోబడి, పోవడి, సంచు, సన్న, సవ, సుద్ది, సైగ, సొవ

సంబంధిత పదాలు

ఆనాలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. అతని శరీరము ఆనవాలు లేకుండ చిద్రమైనది. (గుర్తించుటకు వీలు లేని)
  2. "సీ. పాలఁబోల్‌ వయసు నీపాలు సేయుటకిదె యానవాలన్నట్టు లానవాలు." శశాం. ౩, ఆ.
  3. "సీ. ...మునివల్లభ నా కానవాలు దెమ్ము, నృపుపాల ననియె నన్నెలఁత యుదంకుఁడు సనుదెంచి విభునభిజ్ఞాన మడిగె." భార. అశ్వ. ౩,ఆ. ౯౫.
  4. ఆయన నన్ను ఆనవాలు పట్టలేదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆనవాలు&oldid=921763" నుండి వెలికితీశారు