తాంబూలము
Jump to navigation
Jump to search
తాంబూలము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- తాంబూలము నామవాచకము.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తాంబూలము అంటే తమలపాకు,వక్క చేర్చినది.ఇది మర్యాదార్ధము,గౌరవార్ధము,సంప్రదాయార్ధము ఇస్తారు.బోజనానంతరము దీనిని నమలడము సంప్రదాయము,దీనిలో ఉండే తమలపాకులో ఉన్న రసాయనిక గుణము పంటికి ఆరోగ్యము,పంటి వ్యాదులనుండి కాపాడుతుందని పెద్దల విశ్వాసము. పేరంటాలలో ఇచ్చే తాంబూలము లో తమలపాకులు వక్క పండ్లు లేక టెంకాయ చేర్చి ఇస్తారు. స్త్రీలకు తాంబూలము ఇచ్చే సమయంలో వీటికి పసుపుకొమ్ము, పూలు, పూల సరము చేర్చి ఇస్తారు. వివాహ సమయంలో ఇచ్చే తాంబూలమును ఒక సంచిలో వేసి వీటికి చాక్‌లెట్ చేర్చి ఇచ్చే అలవాటు ఉంది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయ పదములు
- త(ము)(మ్ము)లము, తమ్మ, ముఖభూషణము, వక్కాకు, విడియ, విడియము, వి(డె)(డ్డె)ము, విడ్యము, వీటి, వీటిక, వీడె, వీ(డె)(డియ)ము, వీడ్యము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
" తాంబూలాలు ఇచ్చేశాము తన్నుక చావండి" = ఇది ఒక సామెత.