body
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, శరీరము, దేహము, కాయము.
- somebody యెవడో.
- anybodyయెవడైనా.
- nobody యెవరులేదు.
- everybody అందరు.
- all over theనిలువెల్లా.
- a dead body పీనుగ, శవము.
- the body was carried out of the town ఆ పీనుగ పట్ణానికి బయట తీసుకొని పోబడ్డది.
- a headless body కబంధము, మొండెము.
- or person మనిషి.
- she is a good body అది మంచి మనిషి.
- the old body will not agree ముసిలిది వొప్పదు.
- a busy body అధిక ప్రసంగి, దుర్వ్యాపారానికి పొయ్యేవాడు.
- principal part ముఖ్యమైన భాగము.
- the body of the people were in our favour, but a few were agaisnt us జనమంతా మా పక్షముగా వుండినారు గాని కోందరు మాత్రము విరుద్ధముగా వుండిరి.
- a few troops have arrived, but the body of army not come yet కొంత సేన వచ్చిందిగాని ముఖ్యమైన దండు రాలేదు.
- the body of the tree is sound but the branches have perished కొమ్మలు పోయినవి అడుగు మొద్దు మాత్రము బాగా వున్నది.
- the body of the letter was in his hand writing ఆ జాబులో ముఖ్యమైన భాగమును సొంతముగా వ్రాసినాడు.
- the body of her gown was red, the skirt was white దాని గౌను నడుములమట్టుకు యెరుపున్ను కింది పావడ తెలుపుగా వుండినది.
- or assembly గుంపు, స్తోమము.
- they came in a body గుంపుగా వచ్చిరి.
- a body of travellersబాటసారుల గుంపు.
- a body of police బంట్రోతుల గుంపు.
- a body of soldiersకాల్బలము.
- a body of friends ఆప్తవర్గము.
- a body of horse గుర్రపు దళము.
- there was large body of evidence బహుమంది సాక్షులువుండిరి.
- a body of poetry కావ్య గ్రంధములు.
- a body of divinity వేదాంతసార సంగ్రహము.
- a body of law ధర్మ శాస్త్రము.
- a body of medicine వైద్య శాస్త్రము.
- the coach had a black body with a red carriage బండిపయిపెట్టె నలుపున్ను అడుగు చట్టము యెరుపుగానున్ను వుండెను.
- the body of the church is old, the front is new ఆ గుడియొక్క ముఖ్యమైన భాగము పాతది ముఖమంటపము కొత్తది.
- the heavenly bodies సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలైనవి.
- or strength of wine కారము, సత్తువ.
- this wine has no body యీ సారాయిలో కారములేదు, చప్పగా వున్నది.
- or substance వస్తువు.
- glass is a brittle body గాజు పెళుచైన వస్తువు.
- this is a metallic body యిది వక లోహము.
- wood is an inflamable body కాష్టము దహనశీలమైనది, కొయ్య అంటుకొనేటిది.
- a particle or atomic body అణువు, కణము.
- she has a fine body of voice దానిది మంచి శారీరము.
- able bodied దృఢగాత్రుడైన, కాయపుష్టిగల.
- the bank burst and a large body or water broke out కట్ట తెగి విస్తారము నీళ్ళుపోయినది.
- BODY అనే శబ్దమును తప్పుగా ప్రయోగిస్తారు, యేలాగంటే, వాడికి వొళ్ళు కుదురు లేదు, దానికి వొళ్ళు కుదురుగా వున్నది, వారికి శరీరము కుదురలేదు.
- he is ill, she is well, they are unwell, యిట్లా అనకుండా his body is not well అంటే వాడి పీనుగ బాగా వుండలేదు, అని విరుద్ధముగా అర్థమౌతున్నది గనుక యీలాటి స్థలములలో body అనగా శవము, మానము, పొట్ట, పేగులు అని భావిస్తున్నది గనుక యీ శబ్దము బహు పదిలముగా ప్రయోగించవలసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).